Ursula Re Elected as President : యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా మరోసారి ఉర్సులా..!
Sakshi Education
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మరోసారి ఎన్నికయ్యారు.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మరోసారి ఎన్నికయ్యారు. మొత్తం 720 మంది సభ్యులున్న చట్టసభలో 707 మంది హాజరుకాగా.. 15 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉర్సులా వాండర్‌కు అనుకూలంగా 401 ఓట్లు, వ్యతిరేకంగా 284 ఓట్లు వచ్చాయి.
Miss Universal Petite: పొట్టి మహిళల అందాల పోటీలో విజేతగా నిలిచిన కన్నడ బ్యూటీ!
ఎన్నికైన ఉర్సులా మరో ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఎన్నికైన ఉర్సులా మాట్లాడుతూ.. ఈయూ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పర్యావరణ పరిరక్షణకు, వలసల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఉక్రెయిన్‌కు ఆమె ఎప్పుడూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
Published date : 23 Jul 2024 03:56PM