Skip to main content

QS World University Rankings 2024: హైదరాబాద్‌ ఐఎస్‌బీకి 78వ ర్యాంకు

QS World University Rankings 2024

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్‌ కాలేజీల జాబితాతో కూడిన క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–2024లో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) సత్తా చాటింది. ప్రపంచ టాప్‌–100 బి–స్కూల్స్‌ ర్యాంకుల్లో 78వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఐఐఎం–బెంగళూరు 48వ ర్యాంకుతో టాప్‌–50లో చోటు సంపాదించగా ఐఐఎం–అహ్మదాబాద్‌ 53వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 59వ ర్యాంకు సాధించాయి.

చ‌ద‌వండి: Jagananna Civil Services Incentive Scheme: సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం జగనన్న ప్రోత్సాహక పథకం.. అర్హతలు ఇవే..

గతేడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌–100లో ఈ నాలుగే ఉండటం విశేషం. ఇండోర్, ఉదయ్‌­పూర్, లక్నో ఐఐఎంలు 150–200 ర్యాంకింగ్స్‌ మధ్య నిలవగా ఢిల్లీ, గుర్గావ్‌ ఐఐఎంలు 200–250 ర్యాంకుల మధ్య నిలిచాయి. అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ బిజినెస్‌ స్కూల్‌ తొలి స్థానంలో నిలిచింది.

Published date : 27 Oct 2023 02:01PM

Photo Stories