Jagananna Civil Services Incentive Scheme: సివిల్స్ ప్రిపరేషన్ కోసం జగనన్న ప్రోత్సాహక పథకం.. అర్హతలు ఇవే..
సివిల్స్ సాధిస్తామనే ధైర్యం కలుగుతోంది
నేను తిరుపతి గిండి ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌కు కోచింగ్ తీసుకుంటున్నాను. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా పేదల కోసం ప్రవేశపెట్టి జగనన్న ప్రొత్సాహక పథకం చాలా మందిని సివిల్స్ వైపు దృష్టిపెట్టేలా చేసింది. ప్రిలిమ్స్ కొంత కష్టపడి ఉత్తీర్ణులైతే మెయిన్స్‌కు ఈ పథకంతో కొంత ఆసరా లభిస్తుంది. మంచి కోచింగ్ తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
– మణిదీప్, సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థి, తిరుపతి
మా లాంటి వారికి ఆసరా
సివిల్స్‌పై ఆసక్తి ఉన్న మాలాంటి విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్ కొంత మేర ఉత్తీర్ణత సాధిస్తామనే ధైర్యం ఉంది. మెయిన్స్ కోసం ప్రభుత్వం అందించే ప్రోత్సాహకంతో మంచి కోచింగ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.
–కృష్ణవేణి, సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థిని, తిరుపతి
దరఖాస్తు ఇలా..
2023లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి వచ్చే నెల 4వ తేదీలోపు ఏపీ జ్ఞానభూమి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఉన్నత లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్న పేద విద్యార్థులను ప్రొత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– యూ.చెన్నయ్య, తిరుపతి జిల్లా ఎస్సీ సంక్షేమ,
సాధికారిత అధికారి
తిరుపతి సిటీ: ఎందరో పేద విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని కలలు కంటారు. ఆర్థిక ఇబ్బందులతో కలలు కలలుగానే నిలిచి పోయి ఏదో కోల్పోయామని మదన పడుతుంటారు. ఈనేపథ్యంలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలను అధిక సంఖ్యలో రాసేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటీవ్ పథకాన్ని ప్రవేశపెడుతూ విధివిధానలతో జీవో ఎంఎస్ 58ని ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అవసరమైన కోచింగ్, ఇతర అవసరాల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది.
అర్హతలు ఇవి
అభ్యర్థులు తాము సివిల్స్ ప్రిలిమ్స్ లేదా మెయిన్స్‌లో అర్హత సాధించినట్లు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలకు మించకూడదు.
అభ్యర్థుల కుటుంబాలకు 10 ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి.
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.
చదవండి: Civil Services Incentive Scheme: యూపీఎస్‌సీ అభ్యర్థులకు ఆర్థిక అండగా జగనన్న పథకం
చాలా గొప్ప పథకం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేద విద్యార్థులు రుణపడి ఉంటారు. నాకు సివిల్స్ సర్వీసెస్ లాంటి పోటీ పరీక్షలకు అధ్యాపకునిగా 30ఏళ్లు అనుభవం ఉంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహక పథకం చాలా గొప్పది. కోచింగ్ సెంటర్లకు లక్షలు కుమ్మరించలేని నిరుపేదలకు ఇది ఊరటనిచ్చే అంశం. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన చాలామంది మెయిన్స్‌లో తప్పుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం సరైన కోచింగ్ లేకనే. ఆర్థిక సాయం చేసి ప్రోత్సహించడం శుభపరిణామం. ఎక్కువ మంది పేదలు సివిల్స్ వైపు మొగ్గు చూపుతారు.
– డాక్టర్ టి.సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీయూ వీసీ మెంబర్, సీకాం విద్యాసంస్థల చైర్మన్
పేద వర్గాలకు వరం
సివిల్స్ సర్వీసెస్ ఉద్యోగాలు సాధించాలని చాలామంది కలలు కంటారు. కొంత కష్టసాధ్యంతో కూడుకున్న పరీక్ష ఇది. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైనా మెయిన్స్ కోసం కచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిందే. అటువంటి పరిస్థితిలో పేదలకు కోచింగ్ తీసుకునే స్థోమత లేని అభ్యర్థులు మెయిన్స్‌లో చాలా మంది వెనుకబడుతుంటారు. అటువంటి వారికి జగనన్న ప్రోత్సాహక పథకం వరం లాంటిది. మెయిన్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం శిక్షణ పొందేందుకు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. అటువంటి వారికి ఈ పథకం ఆసరా.
– డాక్టర్ సురేష్ కుమార్ గిండి, ఆంథ్రోపాలజీ, సీనియర్ సివిల్స్ పోటీ పరీక్షల అధ్యాపకుడు, తిరుపతి
Tags
- Civils
- Civils Exams
- Civils Preparation Plan
- Jagananna Civil Services Incentive scheme
- Jagananna Civil Services Incentive Scheme details
- Andhra Pradesh Govt New Scheme
- AP govt schemes
- Scholarships
- Competitive Exams
- UPSC
- Financial Aid Scheme
- Empowerment initiatives
- Jagananna Civils Incentive Scheme
- Civil Services Examination 2023
- Government Encouragement Program
- Civils Prelims and Mains
- Sakshi Education Latest News