Civil Services Incentive Scheme: యూపీఎస్‌సీ అభ్యర్థులకు ఆర్థిక అండగా జగనన్న పథకం
Sakshi Education
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులు వారి వార్షిక ఆదాయం ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు.
సాక్షి ఎడ్యుకేషన్: యూపీఎస్‌సీ ద్వారా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలు ఉండాలన్నారు. jnanabhumi. a p.gov.in వెబ్ సైట్ ద్వారా నవంబర్ 4 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2023 సంవత్సరంలో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Published date : 22 Oct 2023 02:14PM