4 Days Work a Week: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ఇక నుంచి వారానికి 4రోజులే పని..!
![four days work a week Four-day workweek implementation in UK companies](/sites/default/files/images/2025/01/30/employees-four-days-work-week-1738207382.jpg)
ఇకపై వారానికి 4 రోజులే పని. ఐదు రోజులు పనిచేయాలని కోరితే అనేక మంది ఉద్యోగులు రాజీనామా కూడా చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
10వ తరగతి ఇంటర్ అర్హతతో అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు: Click Here
మీరు కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారా. అయితే వారానికి ఐదు రోజులు పనిచేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు వారంలో 4 రోజుల పనిదినాల నిర్ణయానికి (FourDayWorkWeek) ఆమోదం తెలిపారు. దీనిని తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్(UK)లో దీనిని అమలు చేస్తున్నారు. 200 కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నాలుగు రోజుల పని వారాన్ని అంగీకరించాయి. ఈ సంస్థలు సమిష్టిగా 5,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఛారిటీ, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి రంగాలకు చెందినవి. 4 డే వీక్ ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేస్తున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం వచ్చిందని చెప్పవచ్చు.
ఇప్పటికే పలు కంపెనీల్లో..
ఇది ఉద్యోగులు, యజమానులు ఇద్దరికీ ఉపయోగకరమైనదని అనేక బ్రిటిష్ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయి. ప్రారంభంలో మార్కెటింగ్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు వంటి రంగాలలో దాదాపు 30 కంపెనీలు ఈ మార్పును ఆమోదించాయి. ఆ తర్వాత ఛారిటీ, NGO, సామాజిక సంరక్షణ రంగాల నుంచి 29 సంస్థలు, టెక్నాలజీ, IT, సాఫ్ట్‌వేర్ రంగాలలో 24 సంస్థలు ఈ మార్పు ఆమోదించాయి. ఈ పద్ధతి ద్వారా ఉత్పాదకతను పెంచడానికి, ప్రతిభను ఆకర్షించడానికి సరిగ్గా ఉపయోగపడతాయని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
రమ్మంటే రాజీనామా
లండన్ నగరంలోని వ్యాపారాలు ఈ ట్రెండ్‌ను ముందుగా స్వీకరించారు. రాజధానిలోని 59 సంస్థలు ఇప్పటికే నాలుగు రోజుల పని వారం విధానాన్ని అనుసరిస్తున్నాయి. COVID-19 మహమ్మారి తరువాత, పనితీరు పట్ల ఉన్న సాంస్కృతిక మార్పుల ప్రభావంతో ఈ నిర్ణయానికి మరింత ఆదరణ పొందింది. కొన్ని సంస్థలు, ప్రాముఖ్యంగా JP మోర్గాన్, అమెజాన్ వంటి కంపెనీలు వారానికి ఐదు రోజులు కార్యాలయంలో హాజరుకావాలని కోరుతున్నా, చాలా మంది ఉద్యోగులు రిమోట్ పనిని ఆశిస్తున్నారు. ఈ సందర్భంలో స్టార్లింగ్ బ్యాంక్ CEO సిబ్బందిని తరచుగా కార్యాలయానికి రావాలని చెప్పినప్పుడు, కొంత మంది ఉద్యోగులు నిరసనగా రాజీనామా చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
ఉద్యోగుల సంతోషం..
ఈ క్రమంలో నాలుగు రోజుల పని వారాన్ని క్రమంగా అంగీకరించడాన్ని, ఐదు రోజుల పనివేళలు ప్రస్తుతం పాతకాలపు జ్ఞాపకమని పలువురు వాదిస్తున్నారు. 4 డే వీక్ ఫౌండేషన్ ప్రచార డైరెక్టర్ జో రైల్, ఐదు రోజుల పనివేళలను 'గతకాలం నుంచి మిగిలిన అవశేషం' అని పేర్కొన్నారు. "9-5 ఐదు రోజుల పని వారం 100 సంవత్సరాల క్రితం మొదలయ్యిందన్నారు. కానీ ఇప్పుడు అది కాలం చెల్లిన విధానమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు కావాలని ఆయన చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం నాలుగు రోజుల పని వారంలో ఉద్యోగులకు అదనంగా దొరికే సమయం, వారి జీవితాలను సంతృప్తికరంగా, ఆనందంగా గడపడానికి తోడ్పడుతుందన్నారు. ఈ నిర్ణయం పట్ల అక్కడి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tags
- Weekly 4days work for employees
- Good News for Employees
- work 4 days a week
- Weekly 4days work
- 4 working days in a week
- corporate company employees working 4days a week
- 4 working days in a week currently being implemented in the United Kingdom
- 4working days in a week implemented UK
- private employees 4 working days in a week
- private jobs
- employees news
- Pvt employees good news