Skip to main content

100 days Free coaching: నిరుద్యోగులకు BC స్టడీ సర్కిల్స్‌లో 100 రోజుల పాటు ఉచిత శిక్షణ 1500 రూపాయలు స్టైఫండ్ కూడా..

Free training for unemployed   Free coaching and financial aid for unemployed in Telangana  Government job preparation support in Telangana
Free training for unemployed

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతుంది. ఈ కోచింగ్ కు ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉచిత కోచింగ్ తో పాటు ప్రతి నెల 1500/- రూపాయలు ప్రభుత్వం అందించబోతుంది.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ ఇకపై ATM నుంచి PF విత్‌డ్రా..ఎప్పటి నుంచంటే..!: Click Here

ఈ ఉచిత కోచింగ్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అందిస్తుంది.. అర్హత ఉండే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 

అర్హులు: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ ఫీజు: ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 

ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు: 100 రోజులు పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. 

కోచింగ్‌ ఎక్కడంటే: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్ లో ఈ ఉచిత కోచింగ్ ఇస్తారు.

ఏ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ: రైల్వే, బ్యాంక్, SSC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ ఉచిత శిక్షణ ఇస్తారు. 

స్టైఫెండ్: ఈ ఉచిత కోచింగ్ కు అర్హత పొందిన వారు ప్రతి నెల 75% హాజరు ఉంటే వారికి 1500/- రూపాయలు స్టైఫెండ్ ఎంత ఇస్తారు..

ఎలా అప్లై చేయాలి:
ఈ ఉచిత శిక్షణకు తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్స్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. 
ఈ శిక్షణకు అవసరమైన లింక్ క్రింది ఇవ్వబడినది దానిపై క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.

ఉచిత కోచింగ్ నిర్వహించే విధానం : 
అత్యంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో ఈ క్లాసులు నిర్వహిస్తారు. 
ప్రతిరోజు ఉచిత శిక్షణ ఉంటుంది.
అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ ప్రిటేషన్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, GK, ఇండియన్ పాలిటి, ఇండియన్ ఎకానమీ , ఇండియన్ జాగ్రఫీ,  ఇండియన్ హిస్టరీ, కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపరమైన సబ్జెక్టులను అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బోధిస్తారు.

అప్లికేషన్ తేదీలు :
ఉచిత శిక్షణకు అప్లై చేయాలి అనుకునే నిరుద్యోగులు ఆన్లైన్ లో జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 
అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, కాబట్టి అర్హత ఉండే నిరుద్యోగులు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

ఎంపిక విధానం : 
ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్, డిగ్రీ అర్హతలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం సీట్లలో SC రిజర్వేషన్ అభ్యర్థులకు 15% , ST రిజర్వేషన్ అభ్యర్థులకు 5% , BC – A రిజర్వేషన్ అభ్యర్థులకు 18% , BC–B రిజర్వేషన్ అభ్యర్థులకు 26% , BC – C రిజర్వేషన్ అభ్యర్థులకు 3% , BC – D రిజర్వేషన్ అభ్యర్థులకు 18% సీట్లు కేటాయిస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: అర్హత గల వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు.

ఉచిత కోచింగ్ ప్రారంభ తేదీ:
ఈ ఉచిత శిక్షణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిల్స్ లో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

సంప్రదించవలసిన నెంబర్ : అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-24071178 అనే నంబర్ కు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Apply Link: Click Here
 

Published date : 30 Jan 2025 08:45AM

Photo Stories