Skip to main content

Gurukul Schools Admissions: విద‍్యార్థుల గురుకుల ప్రవేశ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే..!

విద్యార్థులకు గురుకు పాఠశాలలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది ప్రవేశాల కోసం పరీక్షల నిర్వాహణకు ఏర్పాట్లు గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పరీక్ష వివరాలు, ప్రవేశానికి దరఖాస్తులు వంటి వివరాలను వెల్లడించారు..

ఐదో తరగతి గురుకుల పాఠశాలలు..

తూర్పుగోదావరి జిల్లా:

కొవ్వూరు, గోపాలపురం, లక్ష్మీనరసాపురం, కొత్తూరు, బొమ్మూరు, వీరలంకపల్లి.

కాకినాడ జిల్లా:

పిఠాపురం, సాంబమూర్తినగర్‌, పి.వెంకటాపురం, జగ్గంపేట, ఏలేశ్వరం, ఎ.మల్లవరం, లోవకొత్తూరు(బాలురు), వెలమకొత్తూరు(బాలికలు), చొల్లంగిపేట

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా:

గోడి(బాలురు), గోడి(బాలికలు), రాజోలు, ద్రాక్షారామ, నరేంద్రపురం, ముమ్మిడివరం

పదో తరగతి, ఇంటర్‌ గురుకుల పాఠశాలలు ఇలా

రాయవరం: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. పేద, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశానికి ఈ నెల 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్పొరేట్‌ తరహాలో..ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 23వ తేదీ తుది గడువుగా ప్రభుత్వం ప్రకటించింది. సీటు సాధిస్తే వసతితో పాటు ఇంటర్మీడియెట్‌ వరకూ ఉచితంగా చదువుకునే అవకాశం కలుగుతుంది. నీట్‌/ఐఐటీలో ఉచితంగా శిక్షణ కూడా ఇస్తారు. ఇందులో రాణిస్తే బాలురకు కర్నూలు (చిన్నటేకూర్‌), గుంటూరు(అడివి తక్కెళ్లపాడు), బాలికలకు విజయవాడ(ఈడ్పుగల్లు) గురుకులాల్లో నీట్‌, ఐఐటీలకు శిక్షణ ఇస్తారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 700 సీట్లు కేటాయిస్తారు.

Andhra pradesh Govt Jobs 2024: డీఎంహెచ్‌వోలో 68 పోస్టులు.. దరఖాస్తుల‌కు ఈరోజే చివరి తేది

గతేడాది మెరుగైన ప్రతిభ

విద్యార్థులు మార్చి 10న జరిగే కామన్‌ టాలెంట్‌ ఎంట్రన్స్‌లో ప్రతిభ చూపి ప్రవేశాలు పొందవచ్చు. గత విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలలో చదివిన 68 మంది విద్యార్థులు దేశంలోని పలు ప్రముఖ ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడం గమనార్హం. 44 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు పొందడం ద్వారా గురుకుల పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా నిలిచాయి.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ..

తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 21 గురుకులాలున్నాయి. అనపర్తి మండలంలోని కొత్తూరు జూనియర్‌ కళాశాల మినహా మిగిలిన 20 గురుకులాల్లో ఐదవ తరగతికి 80 సీట్లు వంతున 1,600, తుని మండలం లోవకొత్తూరులోని ఉన్న పాఠశాల మినహా మిగిలిన 20 జూనియర్‌ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలికలకు 16, బాలురకు 5 గురుకుల పాఠశాలలున్నాయి. కాకినాడ జిల్లాలో తొమ్మిది, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఆరు వంతున గురుకుల పాఠశాలలున్నాయి.

Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తామని.. రూ.1.93 కోట్లు వసూలు

అర్హతలివీ..

జూనియర్‌ ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు 2023–24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షకు హాజరవుతున్నవారు అర్హులు. వయసు 31–08–2024 నాటికి 17 సంవత్సరాలు దాటకూడదు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం, సాంఘిక సంక్షేమ వసతి కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు ఏడాది పాటు సడలింపు ఉంటుంది. ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01–09–2011 నుంచి 31–08–2015 మధ్య జన్మించి ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టడ్‌ క్రిస్టియన్‌ (బీసీ–సీ) విద్యార్థులు 01–09–2013 నుంచి 31–08–2015 మధ్య జన్మించి ఉండాలి. విద్యార్థులు సొంత జిల్లాలో 2022–23 ఏడాదిలో 3వ తరగతి, 2023–24 ఏడాదిలో 4వ తరగతి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదవాలి. ఇంటర్‌లో ప్రవేశానికి 10వ తరగతి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి. ఐదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోనున్న విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటకూడదు.

SSC 10th Class Public Exams 2024: ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!

ప్రవేశ పరీక్ష ఇలా..

గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షను నాల్గవ తరగతి సిలబస్‌ను అనుసరించి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు. తెలుగు సబ్జెక్టుకు 10 ప్రశ్నలకు 10 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 10 ప్రశ్నలకు 10 మార్కులు, గణితం 10 ప్రశ్నలకు 10 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్‌ 10 ప్రశ్నలకు 10 మార్కులు, సోషల్‌ 10 మార్కులకు 10 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మీద 50 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు. ఇంటర్‌లో ప్రవేశానికి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్‌పై ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్లుల్లో 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

Intermediate Practical Exams 2024 :ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ఎంపిక విధానం

2024–25 విద్యా సంవత్సరానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న బాలురు, బాలికలకు ప్రవేశ పరీక్షను మార్చి 10న నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్‌ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా గురుకుల విద్యాలయాల్లో సీట్లు కేటాయిస్తారు.

PG Exam: పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

సద్వినియోగం చేసుకోవాలి

గురుకులాల్లో ఐదు, ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశానికి నోటిపికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– నోముల సంజీవరావు, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌, ఏపీ సాంఘిక సంక్షేమ వసతి, విద్యాసంస్థలు, కాకినాడ.

Tips for Exams: త్వరలో జేఈఈ పరీక్షలు.. ఈ చిట్కాలను పాటిస్తే గెలుపు మీదే..!

బాధ్యత తీసుకోవాలి

ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి బాధ్యత తీసుకోవాలి.

– జి.నాగమణి, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

దరఖాస్తులిలా..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌టీటీపీఎస్‌://ఏపీబీఆర్‌ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఫిబ్రవరి 23 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి ఎంపిక చేసుకున్న పాఠశాల/కళాశాల వివరాలను తప్పనిసరిగా రాయాలి. వివరాలు సబ్మిట్‌ చేసిన తర్వాత మార్చుకోవడానికి అవకాశం లేదు. దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు. విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్‌ సెంటర్‌ లేదా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.

JEE Main 2024: మధ్యస్థంగానే జేఈఈ మెయిన్‌.. ఈ ప్రశ్నలు సులభం

రిజర్వేషన్‌ వివరాలు

అన్ని గురుకుల విద్యాలయాల్లో ఎస్సీలకు 75 శాతం, బీసీ–సీ(కన్వర్టడ్‌ క్రిస్టియన్స్‌) 12శాతం, ఎస్టీలకు ఆరు శాతం, బీసీలకు ఐదు శాతం, ఇతరులకు రెండు శాతం సీట్లు కేటాయిస్తారు. ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుంచి తీసివేసిన పిల్లలు, జోగినులు, బసవిన్లు, అనాథలు, అత్యాచార బాధితులు, సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) కింద 15శాతం సీట్లు కేటాయిస్తారు. అటువంటి వారు సర్టిఫికెట్స్‌ జతపర్చాలి. దివ్యాంగులకు మూడు శాతం సీట్లు కేటాయిస్తారు. ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీ కాకుంటే ఎస్సీ కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రతి కేటగిరిలో మూడు శాతం సీట్లు సఫాయి కర్మచారి విద్యార్థులకు కేటాయిస్తారు.

                                          

                                           

Published date : 30 Jan 2024 02:47PM

Photo Stories