Skip to main content

SSC 10th Class Public Exams 2024: ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!

ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!
ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు   Government Measures for Stress  10th Class Public Exams Announcement   Government Initiatives to Reduce Exam Pressure
ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): రానున్న 50 రోజు ల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 నుంచి ఈ పరీక్షలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టనుంది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం పరీక్షల విధానంలో పలు మార్పులు చేపట్టింది. గత విద్యా సంవత్సరంలోనే భారీ మా ర్పులకు శ్రీకారం చుట్టగా, ఈ ఏడాది పది పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ పాఠశాలల్లోనే జూనియర్‌ కళాశాలల ఏర్పాటు ఇలా పలు నూతన సంస్కరణలకు నాంది పలికారు. వీటిలో భాగంగానే ఈ ఏడాది పది పబ్లిక్‌ పరీక్షల్లో ఆరు సబ్జెక్టులను ఏడు పరీక్షలుగా నిర్వహిస్తున్నారు.

Also Read : Model Papers 2024

గత ఏడాది వరకూ ఇలా...

పదో తరగతిలో గత కొన్నేళ్లుగా 11 పరీక్షలను నిర్వహించేవారు. హిందీ మినహా తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, సోషల్‌ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 50 మార్కుల వంతున రెండు పేపర్లు నిర్వహించేవారు. సైన్సులో ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ సబ్జెక్టుకు 50 మార్కుల వంతున రెండు పేపర్లు ఉండేవి. ఒక్కో పరీక్షను ఒక్కో రోజు వంతున 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించేవారు. కరోనా ప్రభావంతో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేశారు. కరోనా తీవ్రత తగ్గడంతో 2021–22 విద్యా సంవత్సరంలో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించగా, 11 పేపర్లను ఏడు పేపర్లకు కుదించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, సోషల్‌ సబ్జెక్టులకు ఒక్కో పేపరుకు 100 మార్కులకు వంతున పరీక్ష నిర్వహించగా, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ పేపర్లను ఒక్కో పేపరుకు 50 మార్కుల వంతున నిర్వహించారు. 2022–23 విద్యా సంవత్సరంలో పది పబ్లిక్‌ పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు.

Also Read :   AP-10th-class timetable-2024

2023–24 విద్యా సంవత్సరంలో...

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, సోషల్‌ సబ్జెక్టులను వంద మార్కుల వంతున నిర్వహిస్తున్నారు. సైన్స్‌ పేపరును మాత్రం రెండు పరీక్షలుగా నిర్వహిస్తున్నారు. ఫిజికల్‌ సైన్స్‌ 50 మార్కులకు, బయలాజికల్‌ సైన్స్‌ పేపరు 50 మార్కులకు నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయాన్ని కూడా ప్రభుత్వం మార్పు చేసింది. గతంలో ఈ సమయం మూడు గంటలు ఉండగా, ఇప్పుడు 15 నిమిషాలు పెంచారు. ఈ 15 నిమిషాల నిడివిలో ప్రశ్నపత్రం చదవడానికి, రాసిన సమాధానాలు సరిచూసుకోవడానికి కేటాయించాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. గత ఏడాది పరీక్షకు పరీక్షకు మధ్య ఒక రోజు గడువు ఉండగా, ఈ ఏడాది వరుసగా రోజుకొక పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పది పరీక్షా విధానంలో  స్వల్ప మార్పులు  సైన్సు సబ్జెక్టులో రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు .

అవగాహన కల్పించాం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది మారిన విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాం. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఏడు పేపర్ల విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు నిర్వహిస్తున్నారు. 2024–25లో సీబీఎస్‌ఈ విధానంలో పది పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు సైన్స్‌ పరీక్ష విషయంలో గందరగోళానికి గురవకూడదనె. సైన్స్‌ పరీక్షను వేర్వేరు రోజుల్లో ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Also Read : AP 10th Class Study Material

Published date : 30 Jan 2024 02:32PM

Photo Stories