Tips for Exams: త్వరలో జేఈఈ పరీక్షలు.. ఈ చిట్కాలను పాటిస్తే గెలుపు మీదే..!
ఈ సమయంలో వారికి చదువుపై దృష్టి ఎక్కువ శాతం ఉంటుంది. చాలామందికి వారి తల్లిదండ్రుల ఒత్తిడి ఉపాధ్యాయుల ఒత్తిడి ఉంటుంది.. మరికొందరు వారికివారే ఒత్తిడి కొనితెచ్చుకుంటారు. అందులోనూ.. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు చదువు ఒత్తిడి ఎక్కువ ఉండగా, వారి ఆరోగ్యం నిద్ర పైన శ్రద్ధ చూపరు.
TS TRANSCO & TSGENCO Jobs: ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
విద్యార్థులు పరీక్షల సమయంలోనే మరింత చురుగ్గా, హుషారుగా మెలగాలి. ఉన్న సమయంలోనే వారి చదువుకు, మెరుగైన ఆరోగ్యం కోసం చేయాల్సిన పనులను చేయాలి.
ఇంటర్ విద్యార్థులే కాదు పరీక్షకు సిద్ధమయ్యేవారు ఎవరైనా ఈ చిట్కాలను పాటించండి. వీటిని పాటిస్తే పరీక్ష సమయంలో మీ ఆలోచనల్లో ఎటువంటి తప్పటడుగు ఉండదు. పరీక్షల సమయంలో మీరు ఎంత ఆరోగ్యంగా హుషారుగా ఉంటే పరీక్షలో ఎటువంటి ఫలితం దక్కినా... అది మీకు స్పూర్తినే ఇస్తుంది.
JEE Main 2024: మధ్యస్థంగానే జేఈఈ మెయిన్.. ఈ ప్రశ్నలు సులభం
1. పాత పరీక్ష పేపర్లను సేకరించాలి, మీకు చెప్పిన పాఠాలను కూడా సేకరించుకొని దాని ప్రకారంగా చదవాలి.
2. చిన్న పెద్ద సందేహాలు, ఎటువంటి ప్రశ్నలు మీకు అర్థం కాకపోయినా మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి.
3. పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగిన సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయానుసారమే చదవాలి.
4. సమయానికి ఆహారం, నిద్ర రెండు ఉండాలి. ఇలా అయితేనే చదువుకున్నది మెదడులో నిలుస్తుంది.
5. అతి ముఖ్యమైన విషయమిది.. ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా కూడా మీరు ఎటువంటి ఒత్తిడికి గురికాకూడదు.
6. ఒక ప్రయత్నంలో విఫలమైనా మరో ప్రయత్నం చేయాలేకానీ, తప్పటడుగు వేయకూడదు.