JEE Main 2024: మధ్యస్థంగానే జేఈఈ మెయిన్.. ఈ ప్రశ్నలు సులభం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు సహా ఇతర కేంద్ర నిధులతో నడిచే ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జనవరి 29న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) మెయిన్ పేపర్–1ను ఉదయం, మధ్యాహ్నం కలిపి రెండు షిఫ్టుల్లో నిర్వహించింది.
ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్ నుంచి కఠినమైన, సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయని... కెమిస్ట్రీలో ప్రశ్నల క్లిష్టత మధ్యస్థంగా ఉండగా, ఫిజిక్స్ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగానే ఉన్నట్లు విద్యార్థులు, నిపుణులు పేర్కొన్నారు.
చదవండి: TS CETS 2024 Dates Release: సెట్లు తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్.. షెడ్యూల్ ఇదే..
మ్యాథమెటిక్స్‌లో గత ప్రశ్నపత్రాల్లో ఇచ్చిన ప్రశ్నల మోడల్స్ ఎక్కువగా పునరావృతమయ్యాయి. ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్, బైనామియల్ కోఎఫీషియంట్స్, స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్స్ అంశాలను సిలబస్ నుంచి తొలిగించినప్పటికీ వాటిపై ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం.
Published date : 30 Jan 2024 12:04PM