Intermediate Practical Exams 2024 :ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు సిటీ/(సెంట్రల్): ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను డీఆర్‌ఓ కె.మధుసూదన్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీకాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోని ల్యాబ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో లోపం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రం దగ్గర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
Also Read : Senior Inter Chemistry Videos
ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం అధికారి గురవయ్య శెట్టి మాట్లాడుతూ.. వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి, జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు 11నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీ వరకు కొనసాగనునన్నాయన్నారు. వొకేషనల్‌కు 42, జనరల్‌కు 144 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వొకేషనల్‌లో 3,449, జనరల్‌లో 22,123 మంది ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా వృత్తివిద్యాధికారి కె.జమీర్ పాషా, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు వై.పరమేశ్వరరెడ్డి, జి.లాలెప్ప, సి.ప్రభు పాల్గొన్నారు.