Inter Admissions : ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల
వేములవాడ: పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్‌లో చేరడానికి అధి కారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జిల్లాలో ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మొద టి సంవత్సరంలో చేరడానికి ఈనెల 31 వరకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లో విద్యార్థుల కోసం లెక్చరర్లు ప్రచారం ప్రారంభించారు. కళాశాలల్లో కల్పిస్తున్న వసతులు, గతంలో సాధించిన ఫలితాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివరించే పనుల్లో నిమగ్నమయ్యారు.
Also Read : Latest Applications news
15 ప్రభుత్వ కళాశాలలు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 20 మండలాలున్నాయి. వీటి పరిధిలో 15 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీతోపాటు వొకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి కోర్సులో 88 చొప్పున సీట్లు ఉంటాయి. ఇటీవలి ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలో 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ లెక్కన కళాశాలల్లో సుమారు 6 వేల మంది విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంది. జిల్లాలోని 13 మోడల్‌స్కూళ్లలో ఇంటర్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో 40మంది చొప్పున విద్యార్థులు చేరవచ్చు. మోడల్ కళాశాలల్లో మొత్తం 2,080 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో మొత్తం 560 సీట్లు ఉన్నాయి. ఇలా అన్ని యాజమాన్య కళాశాలల్లో విద్యార్థులందరూ చేరే అవకాశముంది.