Inter Supplementary Exam 2024: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనం
డీఆర్‌డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు
జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్‌డీసీ) లు ఉన్నాయి. ఆన్‌లైన్ మూల్యాంకనంలో డీఆర్‌డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్‌ఆర్‌ఎస్‌సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు.
ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే
ఆన్‌లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్‌లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇ
చి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లా
తప్పులకు ఆస్కారం లేదు
ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్‌లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్, ఇంటర్ విద్యా మండలి కమిషనర్
Also Read: Andhra Pradesh RGUKT CET 2024 Notification
ఆన్‌లైన్ మూల్యాంకనం ఇలా..
స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్‌సైట్‌లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్‌లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి.
⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్‌టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు.
⇒ మొత్తం 25 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్‌కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు.
⇒ కంప్యూటర్‌కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది.
⇒ ఆన్‌లైన్‌లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు.
⇒ ఆన్‌లైన్ మూల్యాంకనంలో డాష్‌బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్‌లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి.
⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.
⇒ ఒక గ్రూప్‌లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది.
⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్‌లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది.
⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు.
Tags
- Online Evaluation of Answer Sheets of Intermediate Examinations
- AP Intermediate evaluation 2024
- AP Intermediate 2024 News
- 2024 AP Intermediate evaluation
- AP Intermediate exams News
- Intermediate Annual exams2024 evaluation
- BoardOfEducation
- OnlineEvaluation
- IntermediateExams
- AnswerSheets
- SupplementaryExams
- Results
- sakshieducationlatest updates