Skip to main content

Open Schoolలో ప్రవేశాలకు చివ‌రి తేదీ ఇదే..

సూర్యాపేటటౌన్‌ : చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్‌ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ అశోక్‌ ఆగ‌ష్టు 1న‌ ఒక ప్రకటనలో కోరారు.
Open School
Open Schoolలో ప్రవేశాలకు చివ‌రి తేదీ ఇదే..

2023–24 విద్యా సంవత్సరానికి ఆగ‌ష్టు 10వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 11 నుంచి 31వ తేదీ వరకు అపరాధ రుసుంతో గడువు ఉందని పేర్కొన్నారు. ఓపెన్‌ టెన్త్‌లో చేరేందుకు 2023 ఆగస్టు 31వ తేదీ వరకు 14 ఏళ్లు , ఓపెన్‌ ఇంటర్‌లో ప్రవేశానికి 2023 ఆగస్టు 31వ తేదీ వరకు 15 ఏళ్లు నిండి ఉండాలని వివరించారు. ఫీజు, ధ్రువీకరణపత్రాలతో సమీప ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.

చదవండి: Open School: ‘ఓపెన్‌’ విధానంపై అవగాహన కల్పించాలి

మీ సేవ కేంద్రం, టీఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా కూడా ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో చేసిన తర్వాత సంబంధిత ధ్రువపత్రాలను సంబంధిత అధ్యయన కేంద్రంలో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ సెల్‌ నంబర్‌ 8008403523ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

చదవండి: TS Open Schools: ఓపెన్‌ స్కూల్‌ ఓ వరం

Published date : 02 Aug 2023 03:57PM

Photo Stories