Skip to main content

National Overseas Scholarship: విదేశీ విద్యకు ఆర్థిక చేయూత.. ఎంపిక విధానం ఇలా..

National Overseas Scholarship

విదేశాల్లో విద్యను అభ్యసించడం ఎంతోమంది విద్యార్థుల కల. ప్రతిభ ఉండి, చదవాలనే ఆసక్తి ఉన్నా.. ఆర్థిక సమస్యలు ఆ అశలకు అడుకట్టవేసేలా చేస్తాయి. విదేశీ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు కలగానే మిగిలిపోతోంది. ఇలాంటి విద్యార్థులు తమ స్టడీ అబ్రాడ్‌ స్వప్నం సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశమే.. నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

సెంట్రల్‌ సెక్టార్‌ స్కీం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ 2022–23 సంవత్సరానికి గాను నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ కోసం ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ/ఎస్టీ, వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, డినోటిఫైడ్,సంచార,పాక్షిక సంచార జాతులు, సంపద్రాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుచేసుకోవచ్చు.

అర్హతలు

మాస్టర్స్‌ చేయడానికి డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అలాగే వీరు విదేశాల్లో మాస్టర్స్‌ చేయడానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి. పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకునే వారు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ, పీజీలో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే చదివిన ద్యాసంస్థల వివరాలను దరఖాస్తులో తెలియజేయాలి. 
వయసు: 35 ఏళ్లలోపు వయసు వారై ఉండాలి. 

  • అలాగే వీరి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. దరఖాస్తు సమయంలో ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.


స్కాలర్‌షిప్స్‌ ఇలా..

ఈ స్కీమ్‌ కింద 125 స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. ఇందులో ఎస్సీ కులాల వారికి–115, సంచార, పాక్షిక సంచార జాతుల వారికి–06, భూమిలేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు–04 స్కాలర్‌షిప్స్‌ను కేటాయించారు. 

కాలపరిమితి

ఈ స్కీమ్‌ కింద విదేశాల్లో మాస్టర్స్‌ చేసే వారికి మూడేళ్ల పాటు, పీహెచ్‌డీ చేసే వారికి నాలుగేళ్ల కాలానికి స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేస్తారు. ట్యూ షన్‌ ఫీజు, మెయింటనెన్స్‌ అలవెన్స్, అత్యవసర ఖర్చులు, వీసా ఫీజు, ఎక్విప్‌మెంట్‌ అలవెన్స్, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తదితర ఖర్చుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ కింద ఆర్థికసాయం అందిస్తారు.

కావాల్సిన సర్టిఫికేట్స్‌

పదోతరగతి బోర్డ్‌ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఫోటో, స్కాన్డ్‌ చేసిన సంతకం, ప్రస్తుత/పర్మినెంట్‌ అడ్రస్‌ ప్రూఫ్, డిగ్రీ/ప్రొవిజినల్‌ సర్టిఫికేట్, అర్హత పరీక్షకు సంబంధించి ప్రతి సెమిస్టర్‌లో మార్క్‌షీట్స్, సీజీపీఏ/ఎస్‌జీపీఏ ప్రూఫ్, విదేశీ యూనివర్సిటీ కి సంబంధించిన ఆఫర్‌ లెటర్, కుటుంబ ఆదాయ సర్టిఫికేట్, ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌(ఒక వేళ అభ్యర్థులు ఆదాయ పన్నులు చెల్లిస్తున్నట్లయితే), నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌(అభ్యర్థి ఏదైనా సంస్థలో ఉద్యోగి అయితే ) ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ

విదేశీ విద్యకు సంబంధించి ప్రవేశం పొందిన సదరు యూనివర్సిటీ/విద్యాసంస్థ వివరాలు దరఖాస్తు సమయంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ సంస్థ టాప్‌ 500 ర్యాంక్‌ పొందిన ఇన్‌స్టిట్యూట్‌/యూనివర్సిటీలలో ఒకటిగా ఉండాలి. అన్‌కండిషనల్‌ ఆఫర్‌ లెటర్‌ను అప్‌లోడ్‌ చేయాలి.

  • ఒకటికంటే ఎక్కువ యూనివర్సిటీలను ఎంపిక చేసుకున్నట్లయితే.. అందులో ఒక దాన్ని ఎంచుకొని వాటి వివరాలు తెలియజేయాలి.
  • రెండు రౌండ్ల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఒకసారి ఒక సంస్థలో ఒక కోర్సుకు సంబంధించి వివరాలు నమోదు చేసినట్లయితే.. దానిని మార్పు చేయడానికి వీలుండదు. కానీ తర్వాతీ రౌండ్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • లేటెస్ట్‌ క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ప్రకారం–టాప్‌ ర్యాంక్‌ పొందిన యూనివర్సిటీ నుంచి ఆఫర్‌ లెటర్‌ను పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
  • దరఖాస్తుకు ముందే వీసా పొందినట్లయితే.. సదరు వీసా వివరాలు లేదా వీసాకు దరఖాస్తుకు చేసుకున్నట్లయితే సదరు వివరాలను నమోదు చేయాలి. మొబైల్‌ నెంబర్,ఈమెయిల్‌ అడ్రస్‌ను సరిగా రాయాలి.అలాగే అధికారిక వెబ్‌ పోర్టల్‌ నుంచి మాత్రమే దరఖాస్తు  చేసుకోవాలి.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2022
  • వెబ్‌సైట్‌: https://nosmsje.gov.in/


చ‌ద‌వండి: Govt Scholarships: బాలికలకు డీఆర్‌డీఓ ఆర్థిక చేయూత.. నెలకు రూ.15500 ఆర్థిక ప్రోత్సాహం

Last Date

Photo Stories