Skip to main content

Govt Scholarships: బాలికలకు డీఆర్‌డీఓ ఆర్థిక చేయూత.. నెలకు రూ.15500 ఆర్థిక ప్రోత్సాహం

DRDO Girls Scholarship Scheme

బాలికల విద్యకు ఆర్థిక చేయూత అందించేందుకు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) స్కాలర్‌షిప్‌ ప్రకటన విడుదల చేసింది. 2022 ఏడాదికి గాను బాలికలకు /మహిళలకు ఈ స్కాలర్‌షిప్స్‌ను అందజేయనుంది. ఈ స్కీం ద్వారా సంబంధిత సబ్జెక్టులో అండర్‌గ్రాడ్యుయేషన్‌(యూజీ), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సులను చదివే వారికి ఉపకార వేతనాలను అందజేస్తారు. అర్హత, ఆసక్తి గల విదార్థినులు మార్చి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డీఆర్‌డీఓ–బాలికల స్కాలర్‌షిప్‌ స్కీం
సబ్జెక్టులు: ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్,ఎయిరోనాటికల్‌ ఇంజనీరింగ్,స్పేస్‌ ఇంజనీరింగ్,రాకెట్రీ,ఎవియోనిక్స్,ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజనీరింగ్‌.

మొత్తం స్కాలర్‌షిప్‌లు: 30
యూజీ స్థాయి విద్యార్థినులకు అందించే స్కాలర్‌షిప్స్‌ సంఖ్య: 20 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఫస్ట్‌ ఇయర్‌లో అడ్మిషన్‌ పొంది ఉండాలి. జేఈఈ మెయిన్‌ వాలిడ్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.
స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.1,20,000 చెల్లిస్తారు. 

పీజీ స్థాయి విద్యార్థినులకు అందించే స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 10 
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో 2021–2022 అకడమిక్‌ ఇయర్‌లో ఎంఈ/ఎంటెక్‌ /ఎమ్మెస్సీ(ఇంజనీరింగ్‌) ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్‌ పొంది ఉండాలి. వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.
స్కాలర్‌షిప్‌ మొత్తం: నెలకు రూ.15500/ చొప్పున ఏడాదికి రూ.1,86,600 అందిస్తారు. 

ఎంపిక విధానం
యూజీ అభ్యర్థులకు జేఈఈ మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా, పీజీ అభ్యర్థులకు గేట్‌ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

కావాల్సిన సర్టిఫికేట్స్‌
తాజా పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫోటో, ఆధార్‌కార్డ్, ఫ్రూఫ్‌ ఆఫ్‌ అడ్మిషన్, ఫీజు వివరాలు, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సర్టిఫికేట్, దరఖాస్తు ప్రింట్‌అవుట్‌ అవసరం ఉంటాయి. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2022
  • వెబ్‌సైట్‌: https://rac.gov.in/


చ‌ద‌వండి: Scholarship in MSJE: ఎంఎస్‌జేఈ–నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌లు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories