Skip to main content

Scholarship in MSJE: ఎంఎస్‌జేఈ–నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌లు.. ఎంపిక విధానం ఇలా..

 National Overseas Scholarships

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉన్నత విద్య చదువుతున్న షెడ్యూల్డ్‌ క్యాస్ట్, ఇతరుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 125
విభాగాల వారీగా స్కాలర్‌షిప్‌లు: షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌–115, డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్‌ ట్రైబ్స్‌–06, భూమిలేని వ్యవసాయ కూలీలు, ట్రెడిషనల్‌ ఆర్టిజన్స్‌–04.
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ చదివే అభ్యర్థులు బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసే అభ్యర్థులు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలు మించకుండా ఉండాలి. 
వయసు: 01.04.2022 నాటì కి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, 2022–23 విద్యాసంవత్సరానికి టాప్‌ 500 ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/యూనివర్శిటీల్లో పొందిన ప్రవేశం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022

వెబ్‌సైట్‌: http://nosmsje.gov.in/

Last Date

Photo Stories