తెలంగాణలోని వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీజీఈటీ–2020 నోటిఫికేషన్
తెలంగాణలోని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), ఇంటిగ్రేటెడ్ పోస్టు గ్రాడ్యుయేషన్ (ఇంటిగ్రేటెడ్ పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్ (సీపీజీఈటీ)–2020కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు:
అర్హతలు:
దరఖాస్తు ఫీజు:
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.osmania.ac.in
ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు:
- ఉస్మానియా విశ్వవిద్యాలయం
- కాకతీయ విశ్వవిద్యాలయం
- తెలంగాణ విశ్వవిద్యాలయం
- మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
- పాలమూరు విశ్వవిద్యాలయం
- శాతవాహన విశ్వవిద్యాలయం
- జేఎన్‌టీయూహెచ్
అర్హతలు:
- పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ఎంఈడీ కోర్సుకు బీఈడీలో 55 శాతం, ఎంపీఈడీ కోర్సుకు బీపీఈడీ లేదా బీపీఈ కోర్సుకు 55 శాతం ఉత్తీర్ణత ఉండాలి. వీటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
- పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ కోర్సుకు డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు; పీజీ డిప్లొమా ఇన్ జియోగ్రాఫికల్ కార్టోగ్రఫీ కోర్సుకు బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ, ఐదేళ్ల డిప్లొమా ఇన్ ఫైనార్ట్స్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు; పీజీ డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సెలింగ్ కోర్సుకు బీఏ సైకాలజీ, బీఈడీ, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ, బీఏస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోర్సుల విద్యార్థులు; పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సెరికల్చర్ కోర్సుకు బీఎస్సీ(బీజెడ్‌సీ) విద్యార్థులు అర్హులు.
- ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు (ఎంపీసీ/బీపీసీ/ఎంబీపీసీ గ్రూపులు) ఉత్తీర్ణులు, ఎంఏ అప్లయిడ్ కెమిస్ట్రీ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకు ఇంటర్ లేదా తత్సమాన గ్రూపు విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.800
- ఎస్సీ,ఎస్టీ,పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు: రూ.600
- ప్రతి అదనపు సబ్జెక్టుకు దరఖాస్తు ఫీజు రూ.450
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.osmania.ac.in