Skip to main content

Indian‌ Army: టీజీసీ 135 కోర్సుకు అవివాహితుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..

Indian Army TGC 135 Course Notification

ఇండియన్‌ ఆర్మీ జూలై 2022లో ప్రారంభమయ్యే 135వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 40
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.07.2022 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి. జూలై 02, 1995 నుంచి జూలై 01 2002 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:04.01.2022

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in
 

Last Date

Photo Stories