ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (IIFPT)- 2020 నోటిఫికేషన్
ఫుడ్ టెక్నాలజీ విభాగాంలో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ(ఐఐఎఫ్‌పీటీ) తంజావూర్ (తమిళనాడు) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.ఐఐఎఫ్‌పీటీ ప్రతీ ఏటా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ విభాగాల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తోంది.
వివరాలు:
అర్హతలు:
బీటెక్: ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ తేదీలను ఇంకా ప్రకటించలేదు.
ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల దరఖాస్తులకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 30, 2020
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.iifpt.edu.in
అర్హతలు:
- బీటెక్: ఫుడ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ చేయాలనుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతలను 55శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్ 2020లో పేపర్-1 రాసిన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎంటెక్: ఎంటెక్ కోర్సులకు సంబంధించి ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి..
- ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్: ఈ కోర్సులో ప్రవేశాలను కోరుకునే అభ్యర్థులు ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, పుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఫిషరీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏదైనా ఒక దానిలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
- ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ: హోంసైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో బీటెక్ డిగ్రీని పూర్తిచేసి ఉండాలి.
- ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్: ఇండస్ట్రియల్ హోంసైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, అప్లయిడ్ మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఆయా విభాగాల్లో 70 శాతం మార్కులు తప్పనిసరి.
- పీహెచ్‌డీ: పీహెచ్‌డీకి సంబంధించి ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ, అలాగే రెండేళ్ల ఎంఈ/ఎంటెక్ విద్యను పూర్తిచేసి ఉండాలి.
- బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు జేఈఈ మెయిన్ 2020లో పేపర్-1లో సాధించిన స్కోర్ ఆధారంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ప్రవేశాలు కల్పిస్తుంది.
- ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు అభ్యర్థులు బీటెక్(30శాతం వెయిటెజ్)లో సాధించిన మెరిట్, అలాగే ఐఐఎఫ్‌పీటీ(70శాతం వెయిటేజీ) పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐఎఫ్‌పీటీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది.
- పీహెచ్‌డీకి సంబంధించి అకడమిక్‌లో సాధించిన మెరిట్, రాతపరీక్షలో వచ్చిన స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
బీటెక్: ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ తేదీలను ఇంకా ప్రకటించలేదు.
ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల దరఖాస్తులకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 30, 2020
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.iifpt.edu.in