ఆంధ్రప్రదేశ్‌లో ఏకలవ్య Ekalavya Model Residential Schoolsలో ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన తాడేపల్లి(గుంటూరు జిల్లా)లోని ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశానికి, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లలో అడ్మిషన్స్ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఆరో తరగతిలో 60 సీట్లు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన ఖాళీల(బ్యాక్‌లాగ్) కోసం;
అర్హత: ఆరో తరగతిలో ప్రవేశం కోసం 2021–22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్షా విధానం: 6వ తరగతికి 100 మార్కులకు, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి 200 మార్కులకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:17.05.2022
పరీక్ష తేది: 21.05.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apgpcet.apcfss.in/TWREISEMRS
చదవండి: AP Polycet 2022: ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..