Skip to main content

టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఎస్‌ఓఈ స్కూల్స్‌లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

హైదరాబాద్‌(మాసబ్‌ట్యాంక్‌)లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి ఖమ్మం, పరిగిలోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(ప్రతిభా పాఠశాలలు) లో ఎనిమిదో తరగతి ప్రవేశాలకి అర్హులైన బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 130
స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌–ఖమ్మం(బాలురు): 90
స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌–పరిగి(బాలికలు): 40

మీడియం: ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది.
అర్హత: ఏడో తరగతి పూర్తిచేసుకున్న బాలురు, బాలికలు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు.
వయసు: 01.08.2007 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో 100 మార్కులకు నిర్వహిస్తారు. గతేడాది సిలబస్‌ను అ«ధారంగా చేసుకొని ప్రశ్నల సరళి ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, సోషల్, సైన్స్‌లో ప్రతి సబ్జెక్ట్‌ నుంచి 25 మార్కుల చొప్పున 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.tgtwgurukulam.telangana.gov.in

Photo Stories