నిమ్స్‌లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి 2021 నోటిఫికేషన్
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్).. పారా మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 2021 - 22 విద్యాసంవత్సరానికిగాను నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ విభాగానికి సంబంధించిన రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సుల్లో చేరేందుకు సైన్స్ సబ్జెక్టుల్లో బీఎస్సీ పూర్తి చేసినవారు అర్హులు.
వివరాలు:
పారామెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
అందిస్తున్న కోర్సులు
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అందుబాటులో ఉన్న సీట్లు: 104
అర్హతలు:
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 30, 2021.
దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పించే చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2021.
హాల్ టికెట్ల జారీ: ఫిబ్రవరి 8 నుంచి
ప్రవేశ పరీక్ష తేది: ఫిబ్రవరి 10, 2021.
దరఖాస్తు ఫీజు: రూ.700
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nims.edu.in
పారామెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
అందిస్తున్న కోర్సులు
- పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ రేడియేషన్ థెరపీ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ రేడియో థెరపీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ రెస్పరేటరీ థెరపీ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ టెక్నాలజీ
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అందుబాటులో ఉన్న సీట్లు: 104
అర్హతలు:
- కోర్సుల్లో చేరేందుకు బీఎస్సీ సైన్స్/లైఫ్ సైన్స్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
- 2020 డిసెంబర్ 31 నాటికి 30 సంవత్సరాలలోపు ఉన్నవారు మాత్రమే కోర్సుల్లో చేరేందుకు అర్హులు.
- ఎస్సీ/ఎస్టీలకు నిబంధనల ప్రకారం-మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం-అభ్యర్థుల సామాజిక అంశాల ఆధారంగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ/డిజెబిలిటీ వారికి సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేస్తారు.
- మొత్తం సీట్లలో 50 శాతం నిమ్స్‌లో పనిచేస్తున్న (ఇన్ సర్వీస్) అభ్యర్థులకు కేటాయిస్తారు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 30, 2021.
దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పించే చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2021.
హాల్ టికెట్ల జారీ: ఫిబ్రవరి 8 నుంచి
ప్రవేశ పరీక్ష తేది: ఫిబ్రవరి 10, 2021.
దరఖాస్తు ఫీజు: రూ.700
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nims.edu.in