Skip to main content

LIC Scholarship: ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌–2024.. ఈ విద్యార్థులకు మాత్రమే.. చివ‌రి తేదీ ఇదే..

ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితులు కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్న విద్యార్థులకు గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌–2024 పేరిట లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.
LIC Golden Jubilee Scholarship Scheme 2024

అర్హత: 

  • జనరల్‌ స్కాలర్‌షిప్‌: 2021–22, 2022–23, 2023–24 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/ఇంటర్‌/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ  గుర్తింపు పొందిన పాఠశాలలు/కళాశాలలు/ సంస్థల్లో ఏదైనా ఇంటర్, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందుతుంది.
  • స్పెషల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌: పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి  ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తున్నారు. 2021–22, 2022–23, 2023–24 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తు న్న బాలికలకు స్కాలర్‌షిప్‌ అందుతుంది.
  • జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు మెడిసిన్‌(ఎంబీబీ ఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీడీఎస్‌) విద్యార్థులకైతే ఏటా రూ.40,000 ఇస్తారు. 2 విడతల చొప్పున ఏడాదికి రూ.20,000 అందుతుంది. ఇంజనీరింగ్‌(బీఈ/బీటెక్, బీ ఆర్క్‌) విద్యార్థులైతే ఏడాదికి రూ.30,000 ఇ స్తారు. రెండు విడతల్లో రూ.15,000 చొప్పున చెల్లిస్తారు. డిగీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొ మా, ఒకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే ఆ కో ర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20,000 చొప్పున ఇస్తారు. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో రూ.10,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
  • స్పెషల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కీమ్‌ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్‌/డిప్లొమా కోర్సులను పూర్తిచేసేందుకు ఈ మొత్తాన్ని రెండు విడతల్లో 7,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కనీస అర్హతగా పదో తరగతి లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.12.2024
వెబ్‌సైట్‌: https://licindia.in

>> Young Women Success Story : ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థ‌లో ఉద్యోగాల‌ను వ‌దులుకుంది.. ఈ ల‌క్ష్యం కోస‌మే పోరాడి.. చివ‌రికి..!

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 12 Dec 2024 03:51PM

Photo Stories