Skip to main content

EWS Reservations in Medical Admissions: వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌ అమలు

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) మార్గదర్శకాల మేరకు వైద్య విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటా వర్తింపజేస్తా మని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Implementation of EWS in medical courses

ఈ ఏడాది సీట్ల భర్తీకి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ‘ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో 2024–25 అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. మార్గదర్శకాలు రూపొందించాలని జనవరి 31న కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం లేఖ రాసినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన లేదు.

చదవండి: MBBS/BDS Admissions Merit List: ఎట్టకేలకు ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ షురూ.. మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. లిస్ట్ కోసం క్లిక్‌ చేయండి

నేను ఆగస్టు 28న సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇచ్చినా పరిగణనలోకి తీసుకోలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలి’అని కామారెడ్డి ఎమ్మెల్యే కాలిపల్లి వెంకట రమణారెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది బుచ్చిబాబు వాదనలు వినిపిస్తూ.. ‘ఆగస్టు 3 నుంచి ఆగస్టు 13 వరకు ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో రిజర్వేషన్ల వారీగా కటాఫ్‌ మార్కులను ఇచ్చినా.. ఈడబ్ల్యూఎస్‌ కటాఫ్‌ మాత్రం వెల్లడించలేదు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

దీంతో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ విద్యార్థులకు నష్టం కలుగుతుంది. 2021, మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 65కు ఇది విరుద్ధం. అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఈ కోటా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’అని చెప్పారు. ఎంసీఐ మార్గదర్శకాలను పాటిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ తెలపడంతో ధర్మాసనం వాదనలను ముగించింది.  

Published date : 25 Sep 2024 03:57PM

Photo Stories