Skip to main content

ఎన్‌ఐఎఫ్‌ఎంలో పీజీడీఎం కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది మే 1..

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అరుణ్‌ జైట్లీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఎఫ్‌ఎం).. 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌–ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం–ఎఫ్‌ఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వూ, కరికులమ్‌ విటే ఆధారంగా ఎంపికచేస్తారు.
గ్రూప్‌ డిస్కషన్‌– ఇంటర్వూ తేది: 15.06.2021 నుంచి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తును అరుణ్‌ జైట్లీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, సెక్టార్‌–48, పలి రోడ్, ఫరీదాబాద్‌–121001(హర్యానా) చిరునామాకు పంపించాలి.
ఈమెయిల్‌: pgdmfm2021@nifm.ac.in

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ajnifm.ac.in 

Photo Stories