Skip to main content

దోస్త్‌–తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌.. 2021–2022 విద్యాసంవత్సరానికి వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
దీని ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు: బీఏ/బీఎస్సీ/బీకామ్‌/బీబీఏ/బీసీఏ/బీబీఎం/బీఎస్‌డబ్ల్యూ తదితర డిగ్రీ కోర్సులతోపాటు డీ ఫార్మసీ, డీహెచ్‌ఎంసీటీల్లో ప్రవేశాలు లభిస్తాయి.
అర్హత: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

ఎంపిక విధానం: అర్హులైన విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.200

ఫేజ్‌–1 రిజిస్ట్రేషన్స్‌: 01.07.2021 నుంచి 15.07.2021 వరకు
వెబ్‌ ఆఫ్షన్స్‌: 3.7.2021 నుంచి 16.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://dost.cgg.gov.in

Photo Stories