Skip to main content

ఐఐటీ, తిరుపతిలో పీహెచ్‌డీ, ఎంఎస్‌.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 30..

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. 2021 విద్యా సంవత్సరానికిగాను ఎంఎస్‌/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఎంఎస్‌(రీసెర్చ్‌)..
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

పీహెచ్‌డీ..
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, సివిల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌.

అర్హత: మంచి అకడమిక్‌ రికార్డ్‌తోపాటు సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌/యూజీసీ/సీఎస్‌ఐఆర్‌/నెట్‌/ఎన్‌బీహెచ్‌ఎం/జస్ట్‌ అర్హత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ రికార్డ్, ఇంటర్వూ/రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

రాత పరీక్ష/ఇంటర్వూ తేది: 23.05.2021 నుంచి 23.06.2021 వరకు

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://admissions.iittp.ac.in

Photo Stories