ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ లా (ఐపీఎల్)లో ప్రవేశాలకు 2021 నోటిఫికేషన్
మేనేజ్‌మెంట్ విద్యకు ప్రసిద్ధి పొందిన ఐఐఎం రోహ్‌తక్.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ లా (ఐపీఎల్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు అర్హులు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల విద్యార్థులు మే 31వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
ఐఐఎం–రోహతక్ లా: బిజినెస్ మేనేజ్‌మెంట్‌తోపాటు లా అండ్ గవర్నెన్స్‌లో విద్యార్థులకు లోతైన శిక్షణను ఇవ్వడమే లక్ష్యంగా.. ఐఐఎం రోహతక్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సును ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఐఐఎం రోహతక్ ఎక్స్‌టెన్షన్ క్యాంపస్ (గురుగ్రామ్)లో.. నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రాం కింద ప్రవేశాలు కల్పిస్తోంది. ఇంటర్ తర్వాత న్యాయ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఈ కోర్సు ప్రయోజనకరంగా ఉంటుంది.
కోర్సు స్వరూపం : ఈ లా కోర్సులో భాగంగా ఏడాదికి మూడు చొప్పున అయిదేళ్ల కోర్సులో 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్ వ్యవధి మూడు నెలలు. ఈ మొత్తం ప్రోగ్రామ్‌లో భాగంగా బిజినెస్ మేనేజ్‌మెంట్, లీగల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ అందిస్తారు. విజయవంతంగా కోర్సును పూర్తిచేసుకున్న అభ్యర్థులకు బీబీఏ–ఎల్‌ఎల్‌బీతో కూడిన ఐదేళ్ల లా డిగ్రీ పట్టాను అందిస్తారు.
అర్హతలు : జనరల్ కేటగిరి అభ్యర్థులు 60 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
వయసు: జూలై 31, 2021 నాటికి విద్యార్థి వయసు 20 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ : మే 31, 2021
క్లాట్ పరీక్ష తేది : జూన్ 13, 2021
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.iimrohtak.ac.in

- లా యూనివర్సిటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో సాధించిన స్కోర్ ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- షార్ట్‌లిస్ట్ చేసిన విద్యార్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా విద్యార్థుల అకడమిక్, జనరల్ అవేర్‌నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
- ఇంటర్వ్యూలను పూర్తిచేసుకున్న వారిని క్లాట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూతోపాటు పదోతరగతి, ఇంటర్మీడియెట్‌లో చూపిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- వెయిటేజీ : క్లాట్ స్కోర్ 45శాతం, టెన్త్, ఇంటర్ అకడమిక్ మెరిట్‌కు 40శాతం, ఇంటర్వ్యూకు 15శాతం వెయిటేజీ ఉంటుంది.