Skip to main content

NTA-CMAT-2022: మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

NTA-CMAT-2022 Notification

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌).. 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 2022–23 విద్యా సంవత్సరం ప్రవేశాలు మొదలయ్యే నాటికి పరీక్షా ఫలితాలు వెలువడిన డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీమ్యాట్‌–2022 పరీక్షకు వయసుతో సంబం«ధం లేదు.

ఎంపిక విధానం: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కంప్యూటర్‌ బేస్డ్‌ ప్రవేశపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి 4 మార్కుల చొప్పున 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.03.2022

వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/ 

చ‌ద‌వండి: ​​​​​​​ Admission in NEST: నెస్ట్‌–ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories