APRCET 2021: ఏపీఆర్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
- ఏపీఆర్‌సెట్ 2021కు నోటిఫికేషన్ విడుదల
- 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అర్హులు
అర్హతలు
- సైన్స్/ఆర్ట్స్/మేనేజ్‌మెంట్/కామర్స్/లా/ఫార్మసీ/ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. బీసీ/ఎస్సీ/ఎస్టీ/ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి.
- యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ నెట్/గేట్/స్లెట్/జీప్యాట్/ఎంఫిల్ కలిగిన విద్యార్థులు రీసెర్చ్ మెథడాలజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- ఫైనల్ ఇయర్/సెమిస్టర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా ఏపీఆర్‌సెట్‌కు దరఖాస్తుకు అర్హులే.
పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ
- పార్ట్ టైమ్ పీహెచ్‌డీ కోసం ఫుల్‌టైమ్‌కు పేర్కొన్న విద్యార్హతలతోపాటు యూనివర్సిటీ లేదా పీజీ సెంటర్స్‌లో పనిచేసున్న రెగ్యులర్ ఫ్యాకల్టీ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
ఏపీఆర్‌సెట్‌లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఆయా పీహెచ్‌డీ కోర్సుకు ఎంపిక చేస్తారు.
ఆర్‌సెట్ పరీక్ష
- గత పరీక్ష విధానం ప్రకారం–ఈ పరీక్ష మొత్తం 180 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్–ఎలో.. రీసెర్చ్ మెథడాలజీ(టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్) 90 మార్కులకు, పార్ట్–బిలో సంబంధిత సబ్జెక్టు నుంచి 90 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఎంట్రన్స్ టెస్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించిన జనరల్ అభ్యర్థులను, 45శాతం మార్కులు సాధించిన ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగ అభ్యర్థులను అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
ఇంటర్వ్యూ
ఏపీఆర్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధిత యూనివర్సిటీల డిపార్ట్‌మెంట్లు ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి. ఈ ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ కమిటీ ముందు రీసెర్చ్‌పై తమకు ఉన్న ఆసక్తిని ప్రజెంటేషన్ ద్వారా వివరించాలి.
కమిటీలో ఉండేది వీరే
ఇంటర్వ్యూకు సంబంధించి ఆయా యూనివర్సిటీల డిపార్ట్‌మెంట్ హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఒక సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉంటారు. ఏపీఆర్‌సెట్‌తోపాటు, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్ కమిటీ అభ్యర్థులను తుది ర్యాంక్/మార్కులు కేటాయిస్తుంది.
సబ్జెక్టులు
ఆర్ట్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, లా: అడల్డ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, అంత్రోపాలజీ, ఆర్కియాలజీ; బుద్దిస్ట్, జైన, గాంధీయన్ అండ్ పీస్ స్టడీస్; కామర్స్, కంపారిటివ్ ద్రవిడియన్, లిటరేచర్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇం గ్లిష్, సైన్స్, ఆర్ట్స్(విజువల్ ఆర్ట్స్), ఫోక్ లిటరేచర్, హిందీ, హిస్టరీ, ఇంటర్నేషనల్ అండ్ ఏరి యా స్టడీస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, కన్నడ, లేబర్ వెల్ఫేర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, లా, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మేనేజ్‌మెంట్, మ్యూజిక్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డ్రామా థియేటర్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, పాపులేషన్ స్టడీస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డా.బి.ఆర్.అంబేద్కర్ స్టడీస్, రూరల్ డెవలప్‌మెంట్, సంస్కృతం, సోషల్ వర్క్, సోషియాలజీ, తమిళం, తెలుగు, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్, ఉమెన్ స్టడీస్, యోగా.
సైన్స్ విభాగం
అప్లయిడ్ లైఫ్ సైన్సెస్, బోటనీ అండ్ ప్లాంట్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, జాగ్రఫీ, హోమ్ సైన్సెస్, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, మెటీరియాలజీ/స్పేస్ టెక్నాలజీ/అట్మాలజీ/అట్మాస్పియరిక్ సైన్సెస్, ఓషన్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సెరికల్చర్, స్టాటిస్టిక్స్, జువాలజీ అండ్ యానిమల్ సైన్సెస్.
ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ టెక్నాలజీ, మెకానికల్, మెటలర్టికల్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జియో ఇంజనీరింగ్.
పరీక్ష కేంద్రాలు
విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, హైదరాబాద్
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:31.10.2021
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 15.11.2021
పరీక్ష తేదీలు: 2021 నవంబర్ 22 నుంచి 25 వరకు
వెబ్‌సైట్: https://sche.ap.gov.in/rcet
చదవండి: HBCSE IOQ 2021 ఇందులో అర్హత సాధిస్తే...