Skip to main content

Admissions in PJTSAU: పీజేటీఎస్‌ఏయూ, ఎస్‌కెఎల్‌టీఎస్‌హెచ్‌యూలో బీఎస్సీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ(హైదరాబాద్‌), శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ(ములుగు, సిద్దిపేట జిల్లా) 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విభాగంలో వ్యవసాయ బీఎస్సీ డిగ్రీలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తోంది. ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్‌ ర్యాంకర్లు డిసెంబర్‌ 28, 29 తేదీల్లో వర్శిటీలో జరిగే ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని జయశంకర్‌ వర్శిటీ సూచించింది.
B.Sc Admissions in PJTSAU

మొత్తం సీట్లు: 200
కోర్సు, సీట్లు వివరాలు: బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌(నాలుగేళ్లు)-154 సీట్లు; బీఎస్సీ(ఆనర్స్‌)హార్టికల్చర్‌(నాలుగేళ్లు)-40 సీట్లు; బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌(నాలుగేళ్లు)-10 సీట్లు
అర్హత: ఇంటర్మీడియట్‌(బైపీసీ) ఉత్తీర్ణతతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-2022 ర్యాంక్‌ సాధించి ఉండాలి. వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఎంసెట్‌లో పొందిన ర్యాంక్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌: 28.12.2022, 29.12. 2022 అన్ని కేటగిరీలు(ఓసీ,బీసీ, ఎస్సీ,ఎస్టీ); 
వేదిక: యూనివర్శిటీ ఆడిటోరియం, పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్‌ హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://pjtsau.edu.in/

చ‌ద‌వండి: Admissions in TISS: టిస్‌ నెట్‌-2023 పీజీలో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..

Last Date

Photo Stories