Skip to main content

Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్‌ సెషన్‌ 2023-24కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions in UG, PG, PhD in NIFT

నిఫ్ట్‌ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జోద్‌పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబై, న్యూఢిల్లీ, పాటా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్‌.

కోర్సుల వివరాలు
బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌(బీడీఈఎస్‌): ఫ్యాషన్‌ డిజైన్‌/లెదర్‌ డిజైన్‌/యాక్సెసరీ డిజైన్‌/టెక్స్‌టైల్‌ డిజైన్‌/నిట్‌వేర్‌ డిజైన్‌/ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(బీఎఫ్‌టెక్‌)ప్రోగ్రామ్‌.
మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌ (ఎండీఈఎస్‌); మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌(ఎంఎఫ్‌ఎం); మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(ఎంఎఫ్‌టెక్‌).
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ):
అర్హత: యూజీ ప్రోగ్రామ్‌కు 10+2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్, బీఈ, బీటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: యూజీకి 24 ఏళ్లు మించకూడదు. పీజీ కోర్సుకు వయోపరిమితి లేదు.

చ‌ద‌వండి: CTET Exam Notification: సీటెట్ (డిసెంబర్) 2022 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

  • యూజీ, పీజీ ప్రోగ్రామ్‌: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.12.2022
  • దరఖాస్తుల సవరణకు అవకాశం: జనవరి రెండో వారం, 2023.
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జనవరి మూడో వారం, 2023.
  • డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేది: 05.02.2023
  • వెబ్‌సైట్‌: https://www.nift.ac.in/

చ‌ద‌వండి: Admissions in NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ కోర్సులో ప్రవేశాలు..

Last Date

Photo Stories