Skip to main content

CTET Exam Notification: సీటెట్ (డిసెంబర్) 2022 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

CTET Exam Notification

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)..సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)డి సెంబర్–2022 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ప్రతి ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తుంది.

అర్హత
పేపర్–1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్ఈడీ)/డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్–2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ)/బీఎస్సీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

చ‌ద‌వండి: CTET-2022 Notification: సీటెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు..

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం; రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాuý శాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 31.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.11.2022
ఫీజు చెల్లింపు చివరితేది: 25.11.2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 మధ్య

వెబ్‌సైట్‌: https://ctet.nic.in/

Last Date

Photo Stories