Skip to main content

Admissions in SLS-PDEU: ఎస్‌ఎల్‌ఎస్‌–పీడీఈయూ, గుజరాత్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..

SLS-PDEU

గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్శిటీ (పీడీఈయూ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ స్టడీస్‌ 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ ఆనర్స్‌): మార్కెటింగ్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌.
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌(బీఏ ఆనర్స్‌): ఇంగ్లిష్, మాస్‌ కమ్యూనికేషన్, గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, సైకాలజీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్, ఇండిక్‌ స్టడీస్, డిజిటల్‌ హ్యుమానిటీస్‌.
బీకాం(ఆనర్స్‌): ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సురెన్స్, మార్కెటింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, క్రియేటివ్‌ రైటింగ్, ఎన్‌ఏటీ ఎగ్జామ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.05.2022

వెబ్‌సైట్‌: https://sls.pdpu.ac.in

​​​​​​​చ‌ద‌వండి: JEE-Advanced 2022: జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022 ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories