Admissions in NLU Delhi: నేషనల్ లా యూనివర్శిటీ ఢిల్లీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు
కోర్సు, సీట్ల వివరాలు
ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆన ర్స్) ప్రోగ్రామ్: 120 సీట్లు. అర్హత: సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్(10+2) ఉత్తీర్ణులవ్వాలి.
ఏడాది ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్: 80 సీట్లు. అర్హత: ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమానమైన లా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పీహెచ్‌డీ(లా, సోషల్ సైన్సెస్) ప్రోగ్రామ్: 31 సీట్లు. అర్హత: ఎల్‌ఎల్‌ఎం/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్–2024 ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.11.2023.
అడ్మిట్ కార్డుల జారీ తేది: 20.11.2023.
ప్రవేశపరీక్ష నిర్వహణ తేది: 10.12.2023.
వెబ్‌సైట్: https://nludelhi.ac.in/
చదవండి: Admissions in NLU Delhi: నేషనల్ లా యూనివర్శిటీ ఢిల్లీలో ఎల్‌ఎల్‌ఎం(ప్రొఫెషనల్) కోర్సులో ప్రవేశాలు