Skip to main content

UPSC Civils Mains Exam 2024 : అక్టోబర్‌ 21 నుంచి మెయిన్స్‌ పరీక్షలు.. ఇప్పటి నుంచి కృషి చేస్తే మెయిన్స్‌లో మెరిసే అవకాశం

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1–2024 ప్రిలిమ్స్‌ పరీక్ష గత నెలలో ముగిసింది. మొత్తం 563 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియలో తొలిదశగా నిర్వహించిన ఈ పరీక్షకు మూడు లక్షల మందికిపైగా హాజరయ్యారు.
TSPSC Group 1-2024  TSPSC Group 1-2024 Prelims Exam Candidates at TSPSC Group 1-2024 Exam  Candidates appear for UPSC Mains in October according to Advance results

ఈసారి ప్రిలిమ్స్‌లో ఎన్ని మార్కులు వస్తే.. మెయిన్స్‌కు అర్హత లభిస్తుందో చెప్పడం అంత తేలిక కాదంటున్నారు. కారణం.. పేపర్‌ క్లిష్టతతోపాటు పోటీ ఎక్కువగా ఉండటమే!! ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1(2024) ప్రిలిమ్స్‌ విశ్లేషణ.. కటాఫ్‌ మార్కుల అంచనా.. మెయిన్‌ పరీక్ష విధానం.. మెయిన్‌లో రాణించేందుకు ప్రిపరేషన్‌ తదితర వివరాలు.. 

74 శాతం హాజరు
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 (2024) ప్రిలిమ్స్‌కు తాజా అభ్యర్థులు, పాత అభ్యర్థులు మొత్తం కలిపి 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 9వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 74 శాతం హాజరు నమోదైంది. దాదాపు 3.02 లక్షల మంది పరీక్ష రాసినట్లు టీఎస్‌పీఎస్‌సీ వర్గాలు పేర్కొన్నా­యి. ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తి­లో రెండో దశలో మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తా­రు. 1:50కి బదులుగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌­కు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 563 పోస్ట్‌లకు 1:50 నిష్పత్తిలో అయితే 28,150 మంది; 1:100 నిష్పత్తిలో అయితే 56,300 మంది మెయిన్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది.

IIIT Basara Admissions 2024 :బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరంలో తగ్గిన పోటీ

క్లిష్టంగానే ప్రిలిమ్స్‌

  •     గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష క్లిష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌లలో క్లిష్టమైన ప్రశ్నలు అడిగార­ని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఎకనామిక్స్‌లో సైతం సబ్జెక్ట్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చే­సిన వారు మాత్రమే సమాధానం ఇచ్చేలా ప్రశ్న­లు ఉన్నాయని చెబుతున్నారు. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు తికమక పెట్టేలా ఉన్నాయని పేర్కొంటున్నారు. అదే విధంగా అసెర్షన్‌ అండ్‌ రీజన్‌ టైప్‌ ప్రశ్నలు కూడా ఎక్కువగానే ఉండడంతో సమయాభావం ఎదురైనట్లు చెబుతున్నారు.
  •     కరెంట్‌ అఫైర్స్‌లో గత అయిదేళ్ల కాలంలో అమల్లోకి వచ్చిన పథకాలు, వాటి లక్ష్యాల గురించి అడిగారు. దీంతో సమకాలీన పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మాత్రమే సమాధానం ఇచ్చే అవకాశ ఉంది. చరిత్రలో తెలంగాణ సాహిత్యం, సాంస్కృతిక చరిత్రలకు ప్రాధాన్యం 
  • కనిపించింది. మెంటల్‌ ఎబిలిటీలో మాత్రం అభ్యర్థులకు కాసింత ఉపశమనం లభించింది.
  •     మొత్తంగా చూస్తే.. సిలబస్‌పై పూర్తి పట్టు సాధించిన వారే తదుపరి దశకు ఎంపికయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.


కటాఫ్‌ అంచనా 80–85
ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికయ్యేందుకు ఓపెన్‌ కేటగిరీలో 80నుంచి 85మార్కులు కటాఫ్‌గా ఉండొచ్చని అంచనా. ఇతర కేటగిరీలకు పది శాతం అటు, ఇటుగా కటాఫ్‌ ఉంటుందని అంటున్నారు.  ప్రి­లిమ్స్‌ కటాఫ్‌ అంచనాలను పరిశీలించి.. కటాఫ్‌ శ్రేణి­లో ఉంటామని భావిస్తే.. వెంటనే మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభిచాలని నిపుణులు సూచిస్తున్నారు.

అక్టోబర్‌ 21 నుంచి మెయిన్స్‌
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్‌ పూర్తయిన నాలుగు రోజుల్లోనే మెయిన్స్‌ పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి నిర్వహించనున్నారు.

TSPSC Group 4: ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన ఈ అభ్యర్థులకు వైద్య పరీక్షలు

ఆరు పేపర్లుగా మెయిన్స్‌

మెయిన్స్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌)తోపాటు మొత్తం ఆరు పేపర్లలో 900 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌–ఎగా పేర్కొన్న జనరల్‌ ఇంగ్లిష్‌ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పొందిన మార్కులను మెరిట్‌ లిస్ట్‌ రూపకల్పనలో పరిగణించరు. ఈ పేపర్‌లో కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మిగిలిన పేపర్ల మూల్యాంకన చేస్తారు. దీంతోపాటు పేపర్‌–1 జనరల్‌ ఎస్సే 150 మార్కులకు; పేపర్‌–2(హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జాగ్రఫీ)–150 మార్కులకు; పేపర్‌–3(ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్‌) 150 మార్కులకు; పేపర్‌–4(ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌) 150 మార్కులకు; పేపర్‌–5(ఎస్‌ అండ్‌ టీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) 150 మార్కులకు; పేపర్‌–6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) 150 మార్కులకు మెయిన్స్‌ పరీక్ష జరుగుతుంది. మెయిన్‌ పరీక్షలు పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు అందుబాటులో ఉండే సమయం మూడు గంటలు.


మెయిన్స్‌లో.. రాణించే మార్గం
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యాయి. అక్టోబర్‌ 21 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అంటే..అభ్యర్థులకు దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే..ఆశించిన స్థాయిలో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

సంపూర్ణ పరిజ్ఞానం
గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షలో అభ్యర్థులకు ఆయా అంశాలపై ఉన్న సంపూర్ణ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో ఆమూలాగ్ర అధ్యయనం చేసి.. అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే మెయిన్‌ పరీక్ష కోణంలో ప్రిపరేషన్‌ సాగించి.. ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థులకు కొంత సానుకూలత ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడే మెయిన్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించే వారు మాత్రం తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. 

ఇవెంతో కీలకం

  •     మెయిన్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా.. జనరల్‌ ఎస్సే పేపర్‌లో, హిస్టరీ పేపర్‌లో ఉండే తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, హక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
  •     జనరల్‌ ఎస్సే పేపర్‌గా పేర్కొనే పేపర్‌–1 కోసం సమకాలీన సామాజిక అంశాలు,సమస్యలు, ఆర్థి­క వృద్ధి,భారత చారిత్రక,వారసత్వ సంపద,సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  •     పేపర్‌–2లో ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారత చరిత్ర, సంస్కృతి అంశాలు, అదే విధంగా తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వ అంశాలను చదవాలి. వీటితోపాటు భారత, రాష్ట్ర భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి.
  •     పేపర్‌–3 కోసం భారత రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, భారత సమాజం, సమస్యలు, సాంఘిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి.
  •     ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్ట్‌గా పేర్కొ­నే పేపర్‌–4 కోసం భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి, అభివృద్ధి, పర్యావరణ సమస్యల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
  •     సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(పేపర్‌–5)లో రాణించేందుకు సామాజిక అభివృద్ధికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దోహద పడుతున్న తీరు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పద్ధతుల గురించి 
  • ప్రత్యేకంగా తెలుసుకోవాలి.

Civil Assistant Surgeon Posts : ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీలో 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు.. ఈ అర్హ‌త‌లు ఉండాలి..

ఆరో పేపర్‌కు ప్రత్యేకంగా
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఆరో పేపర్‌గా పేర్కొన్న.. తెలంగాణ ఆలోచన (1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పా­టు దశ, ఆవిర్భావం (1991–2014)) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం–1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు, కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం
మెయిన్స్‌ ప్రిపరేషన్‌ క్రమంలో కరెంట్‌ అఫైర్స్‌­కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా.. తెలంగాణకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి వాటిపై మరింత ప్రత్యేక దృష్టితో అభ్యసనం సాగించాలి. ఆర్థిక వనరుల అభివృద్ధి, రాష్ట్రంలో వ్య­వసాయం,సాగు పరిస్థితులు, పారిశ్రామిక విధానా­లు వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

Posts at RECPDCL : ఆర్‌ఈసీపీడీసీఎల్‌లో 25 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. వివ‌రాలు ఇలా..

ప్రత్యేక అంశాలకు ఇలా

  •     తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీపై అభ్యర్థులు మరింత లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మార్కులు పెంచుకునే అవకాశం ఉంది. 
  •     చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యు­ద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు;కళలు;ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉ­న్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి.
  •     జాగ్రఫీలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై పట్టు సాధించాలి.
  •     ఎకానమీలో.. తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు,2011జనాభా గణాంకా­లు;ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై దృష్టిపెట్టాలి.  

Indian Coast Guard Notification : భారతీయ తీర రక్షణదళంలో పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌.. ఈ విభాగాల్లో 320 ఉద్యోగాలు..

Published date : 03 Jul 2024 12:47PM

Photo Stories