Civils Mains Exams: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్స్ పరీక్షలు
Sakshi Education
సివిల్స్ మెయిన్స్ పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. పరీక్ష కేంద్రానికి జాయింట్ కలెక్టర్ విచ్చేసి సందర్శించారు. ఈ పరీక్షలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రారంభమయ్యాయి.
సాక్షి ఎడ్యుకేషన్: మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 171 మందికి 161 మంది పరీక్షలకు హాజరయ్యారు. ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
UG Subjects: యూజీలో మేజర్ సబ్జెక్టుకు ప్రధాన ఎంపిక అమలు
జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. పరీక్షల నిర్వహణను సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. శనివారం, ఆదివారం కూడా పరీక్షలు జరగనున్నాయి.
Published date : 16 Sep 2023 02:29PM