Skip to main content

Indian Coast Guard Notification : భారతీయ తీర రక్షణదళంలో పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌.. ఈ విభాగాల్లో 320 ఉద్యోగాలు..

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షణదళం(కోస్టు గార్డు) పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా నావిక్, యాంత్రిక్‌ విభాగాల్లో 320 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
Navik recruitment   Indian Coast Guard   Mechanic recruitment in Indian Coast Guard  Indian Coast Guard recruitment 2024  Apply now for Indian Coast Guard jobs  Career opportunities in Coast Guard  Defense jobs in India  Indian Coast Guard notification released for applications in various posts

ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వీరు ఆకర్షణీయ వేతనంతో పాటు ప్రోత్సాహాకాలను అందుకోవచ్చు. 

నావిక్‌ యాంత్రిక్‌
ఇండియన్‌ కోస్ట్‌గార్డు ఏటా రెండుసార్లు నావిక్, యాంత్రిక్‌ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తుంది. నాలుగు దశల్లో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా.. వీరి నియామకాలుంటాయి. పురుష అభ్యర్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. యాంత్రిక్‌ ఉద్యోగులు నౌకల నిర్వహణ, మరమత్తులు తదితర విధులు నిర్వర్తిస్తారు. వీరు పదోన్నతుల ద్వారా అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ హోదాకు కూడా చేరుకోవచ్చు. నావిక్‌ జనరల్‌ డ్యూటీలో ఉద్యోగాలు పొందిన వారు జనరల్‌ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు
»    నావిక్‌ జనరల్‌ డ్యూటీ: ఈ విభాగంలో మొత్తం 260 ఖాళీలు ఉన్నాయి. వీటికి మ్యాథ్స్, ఫిజిక్స్, సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
»    యాంత్రిక్‌: ఈ విభాగంలో 60 ఖాళీలున్నాయి. ఇందులో మెకానికల్‌లో–33, ఎలక్ట్రికల్‌–18, ఎలక్ట్రానిక్స్‌ 9 పోస్టులున్నాయి. వీటికి దరఖాస్తు చేయాలనుకునే వారు ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌(రేడియో/పవర్‌) విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Engineering Assistant Trainee Posts : బెల్‌లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ ఉద్యోగాలకు ప్రకటన విడుదల..

వయసు
పైన తెలిపిన పోస్టులను దరఖాస్తు చేసుకునే వారు 18–22 ఏళ్లలోపు ఉండాలి. అంటే మార్చి 1, 2003 –ఫిబ్రవరి 28, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌కు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

పరీక్ష ఇలా
»    స్టేజ్‌–1లో భాగంగా నావిక్, యాంత్రిక్‌ రెండు ఉద్యోగాలకూ ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానం గుర్తించాలి. మొత్తం 5 సెక్షన్లలో ప్రశ్నలు అడుగుతారు.నెగిటివ్‌ మార్కులు లేవు. రెండు పోస్టులకూ సెక్షన్‌–1 ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే వస్తాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు.ఇందులో మ్యాథ్స్‌–20,సైన్స్‌–10, ఇంగ్లిష్‌–15, రీజనింగ్‌–10, జీకే–05 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45నిమిషాలు ఉంటుంది.
»    నావిక్‌ జనరల్‌ డ్యూటీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్‌–2 అదనంగా రాయాల్సి ఉంటుంది. ఈ విభాగానికి 50 మార్కులు. 50 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 30 నిమిషాలు ఉంటంది. ఇందులో ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
»    యాంత్రిక్‌: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్‌–1తో పాటు సెక్షన్‌ 3, 4లలో చదువుకున్న డిప్లొమా బ్రాంచీ ప్రకారం ఏదో ఒకటి రాయాలి. ఎలక్ట్రికల్‌ విభాగంలో వాళ్లు సెక్షన్‌–3, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచీవారు సెక్షన్‌–4, మెకానికల్‌ డిప్లొమా అభ్యర్థులు సెక్షన్‌–5లో ప్రశ్నలు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్‌కూ 50 మార్కులు . 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు. 
»    అభ్యర్థులు ఎంచుకున్న బ్రాంచీలవారీ డిప్లొమా సిలబస్‌ నుంచే ఈ ప్రశ్నలు అడుగుతారు. మాదిరి ప్రశ్నలు, సెక్షన్ల వారీ సిలబస్‌ వివరాలు కోస్టుగార్డు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

Degree Admissions 2024: డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

స్టేజ్‌ పరీక్ష ఇలా
»    స్టేజ్‌–1 పరీక్షల అనంతరం ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కుల ఉండవు.
»    10 పుష్‌ అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థి కనీసం 157 సెం.మీ ఉండాలి. ఊపిరి పీల్చిక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ ఉండాలి. 
»    స్టేజ్‌–3: స్టేజ్‌–2లో అర్హత సాధించిన వారికిని స్టేజ్‌–1లో సాధించిన మెరిట్‌తో స్టేజ్‌–3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కలో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు. తర్వాతి దశకు చేరుతారు. 
»    స్టేజ్‌–4: ఈ దశలో భాగంగా అభ్యర్థుల ఒరిజనల్‌ ధ్రువపత్రాల పరిశీలించి తుదిగా శిక్షణకు తీసుకుంటారు.

Non Teaching Posts : నిట్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు..

ట్రైనింగ్‌
నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ విభాగాల వారికి బేసిక్‌ ట్రైనింగ్‌ ఏప్రిల్, 2025 నుంచి ఏఎన్‌ఎస్‌ చిల్కలో మొదలవుతుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ నిర్వహిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.

వేతనాలు
»    యాంత్రిక్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్‌–5 రూ.29,200 మూలవేతనం లభిస్తుంది. ఇవే కాకుండా రూ.6200 యాంత్రికే పే లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే అన్నీ క­లిపి వీరు రూ.50వేలు వేతనంగా పొందవచ్చు. 
»    నావిక్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవల్‌–3 ప్రకారం–రూ.21,700 మూల వేతనం లభిస్తుంది. అన్నీ కలుపుకొని వీరు నెలకు రూ.35 వేలకు పైగా వేతన రూపంలో పొందవచ్చు. అనుభవం ఆధారంగా ఉన్నత స్థాయి హోదాను కూడా అందుకోవచ్చు.

పరీక్ష కేంద్రాలు
»    తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ.

ముఖ్యసమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 03.07.2024
»    పరీక్ష తేదీలు: స్టేజ్‌–1 సెప్టెంబర్, స్టేజ్‌–2 నవంబర్, స్టేజ్‌–3 ఏప్రిల్‌.
»    వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/cgept

HAL Non Executive Posts : హెచ్‌ఏఎల్‌లో 58 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 03 Jul 2024 01:22PM

Photo Stories