UPSC ESE 2022: ఇంజనీరింగ్ విభాగాల్లో 247 పోస్టులు... దరఖాస్తు వివరాలు ఇలా..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కేంద్రంలోని వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ/గ్రూప్ బీ స్థాయి పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 247
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ( బీఈ/బీటెక్)/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 01.01.2022 నాటికి 21ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో(స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3) నిర్వహిస్తారు.
స్టేజ్ 1లో.. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో 500 మార్కులకు జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ అప్టిట్యూడ్–200 మార్కులకు, పేపర్ 2 సంబంధిత ఇంజనీరింగ్ పేపర్– 300 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా పేపర్లలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మెయిన్‌కు అనుమతిస్తారు.
స్టేజ్ 2లో.. మెయిన్ పరీక్ష మొత్తం 600 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంపై రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ పద్ధతిలో(ఒక్కో పేపర్ 300 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు.
స్టేజ్1, స్టేజ్2లో ప్రతిభ చూపిన వారిని చివరి దశ స్టేజ్ 3 పర్సనాలిటీ టెస్టుకు ఆహ్వానిస్తారు. ఇది 200 మార్కులకు జరుగుతుంది.
స్టేజ్1, స్టేజ్2, స్టేజ్3.. ఇలా మూడు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.09.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021
వెబ్‌సైట్: https://www.upsc.gov.in
Qualification | GRADUATE |
Last Date | October 12,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |