Skip to main content

TSPSC Notification 2022: టీఎస్‌పీఎస్సీలో 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, వార్డెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
tspsc hostel welfare officer notification 2022 and exam pattern

మొత్తం పోస్టుల సంఖ్య: 581
పోస్టుల వివరాలు: గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో అధికారులు గ్రేడ్‌1-5, గ్రేడ్‌2-106, ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌2(మహిళ)-70, గ్రేడ్‌2(పురుషులు)-228, బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌2 (ప్రీ మెట్రిక్‌ బాయ్స్‌ హాస్టల్‌/పోస్ట్‌ మెట్రిక్‌ బాయ్స్‌ హాస్టల్‌/ప్రీ మెట్రిక్‌ గర్ల్స్‌ హాస్టల్‌/పోస్ట్‌-మెట్రిక్‌ గర్ల్స్‌ హాస్టల్‌)-140, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో వార్డెన్‌ గ్రేడ్‌1-5, వార్డెన్‌ గ్రేడ్‌2-03, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖలో మాట్రన్‌ గ్రేడ్‌1-3, మాట్రన్‌ గ్రేడ్‌2-2, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ-చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు-19.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈడీ, బీఈడీ/డీఈడీ(విజువల్‌ హ్యాండిక్యాప్డ్‌ /హియరింగ్‌ హ్యాండిక్యాప్డ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1,వార్డెన్‌ గ్రేడ్‌-1,మాట్రన్‌ గ్రేడ్‌-1 పోస్టులకు రూ.38,890-రూ.1,12,510, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2, వార్డెన్‌ గ్రేడ్‌-2, మాట్రన్‌ గ్రేడ్‌-2, లేడీ సూపరింటెండెంట్‌ పోస్టులకు రూ.35,720-రూ.1,04,430 చెల్లిస్తారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్, పేపర్‌-2లో ఎడ్యుకేషన్‌/స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. పేపర్‌-1లో 150 ప్రశ్నలు, పేపర్‌-2లో 150 ప్రశ్నలు, మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.01.2023.
దరఖాస్తులకు చివరితేది: 27.01.2023.
పరీక్ష తేది: ఆగస్ట్‌-2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Notification 2022: హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories