TSPSC Notification 2023: ఫార్మసీతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హతలు: డిగ్రీ(ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్స్), ఫార్మాడీ లేదా మెడికల్(క్లినికల్ ఫార్మకాలజీ/మైక్రోబయాలజీ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనాలు: ప్రతి నెల రూ.51,320-రూ.1,27,310 వరకు వేతనంగా లభిస్తుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
రాత పరీక్ష: ఈ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. రెండు పేపర్లకు కలిపి మొత్తం 450 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 300 నిమిషాలు.
పేపర్-1: ఈ పేపర్‌లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలుంటాయి. 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు.
పేపర్-2: ఈ పేపర్‌లో సంబంధిత సబ్జెక్ట్‌కు సంబంధించిన డిగ్రీ స్థాయి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. -పేపర్-1 పరీక్షను ఇంగ్లిష్/తెలుగు మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పేపర్-2 పరీక్ష మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: రాత పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాలు కేవలం హైదరాబాద్ పరిధిలో(హెచ్‌ఎండీఏ) మాత్రమే ఉంటాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులకు చివరి తేదీ: 05.01.2023
- వెబ్‌సైట్: https://www.tspsc.gov.in
చదవండి: TSPSC Group 2 Notification: టీఎస్‌పీఎస్సీలో 783 గ్రూప్–2 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |