DMHO Recruitment: డీఎంహెచ్‌వో, ప్రకాశంలో స్టాఫ్ నర్స్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా వైద్యాఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్/యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 62
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు–48, ల్యాబ్ టెక్నీషియన్–05, డేటా ఎంట్రీ ఆపరేటర్–02, లాస్ట్ గ్రేడ్ సర్వీస్–07.
స్టాఫ్ నర్సులు:
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకు రూ.22,500 చెల్లిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్:
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)/బీఎస్సీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ చేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
లాస్ట్ గ్రేడ్ సర్వీస్:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in
చదవండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, నెల్లూరులో 120 పోస్టులు
Qualification | 10TH |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |