DMHO Recruitment: డీఎంహెచ్‌వో, నెల్లూరులో 120 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో)నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 120
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు–60, ల్యాబ్ టెక్నీషియన్–18, డేటాఎంట్రీ ఆపరేటర్–11, లాస్ట్ గ్రేడ్ సర్వీస్–31.
స్టాఫ్ నర్సులు:
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకు రూ.22,500 చెల్లిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్:
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)/బీఎస్సీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
లాస్ట్ గ్రేడ్ సర్వీస్:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ12,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
చదవండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, కడపలో స్టాఫ్ నర్స్ పోస్టులు
Qualification | 12TH |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |