Andhra Pradesh Jobs: డీసీసీ బ్యాంక్, కడపలో 75 క్లర్క్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలో ది కడప డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్.. క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 75
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌పై అవగాహనతోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఆన్‌లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత వి«ధిస్తారు. పరీక్షా సమయం 60
నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021
వెబ్‌సైట్: https://www.kadapadccb.in
చదవండి: Andhra Pradesh Jobs: అనంతపుర్ డీసీసీబీలో 86 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | December 03,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |