Skip to main content

Telangana Jobs: టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు!

Yadadri bhuvanagiri

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: ఎంపీహెచ్‌ఏ/ఏఎన్‌ఎం–31, ఫార్మసిస్ట్‌–08, ల్యాబ్‌ టెక్నీషియన్‌–03.

ఎంపీహెచ్‌ఏ/ఏఎన్‌ఎం:
పదో తరగతి/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. 18 నెలల పాటు పూర్తిచేసిన ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రెయినింగ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. 
వయసు: 18–34ఏళ్ల మధ్య ఉండాలి.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2: ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–34ఏళ్ల మధ్య ఉండాలి. 

ఫార్మసిస్ట్‌: ఇంటర్మీడియట్, డిప్లొమా(ఫార్మసీ)/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–34ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అందులో 90 మార్కులు అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా కేటాయిస్తారు. మరో 10 మార్కులు వయసు పరంగా కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, యాదాద్రి భువనగిరి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18,20, 21.10.2021

వెబ్‌సైట్‌: https://yadadri.telangana.gov.in/

చ‌ద‌వండి: Telangana Jobs: వైద్య విధాన పరిషత్‌లో పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification 10TH
Last Date October 21,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories