DMHO Recruitment: డీఎంహెచ్‌వో, అనంతపురంలో డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్/యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 77
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–18, డేటాఎంట్రీ ఆపరేటర్–26, లాస్ట్ గ్రేడ్ సర్వీస్–33.
ల్యాబ్ టెక్నీషియన్:
అర్హత: పదో తరగతితోపాటు డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)/బీఎస్సీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ చేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
లాస్ట్ గ్రేడ్ సర్వీస్:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.12000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజ్, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, అనంతపురం,ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
చదవండి: Senior Resident Posts: జీఎంసీ, అనంతపురంలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
Qualification | 10TH |
Last Date | September 30,2021 |
Experience | 1 year |
For more details, | Click here |