AP Teacher Jobs: ఏపీ ప్రభుత్వ జడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ.. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ము న్సిపల్/మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ(డీఎస్‌సీ)ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, సంగీత టీచర్ల పోస్టులను భర్తీచేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 214
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.
వయసు: 44ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 49ఏళ్లు.
ఎంపిక విధానం
స్కూల్ అసిస్టెంట్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా ఎంపికచేస్తారు. » మ్యూజిక్ టీచర్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎస్‌జీటీ: టెట్ కమ్ టీఆర్‌టీ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.09.2022
పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cse.ap.gov.in
చదవండి: Army Public School Recruitment 2022: టీచర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 18,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |