TSSPDCL JLM Notification 2023: ఎస్సీడీసీఎల్‌లో 1553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ అంశాలు ఇవే..
మొత్తం జేఎల్‌ఎం పోస్టుల సంఖ్య: 1553
మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
అర్హతలు
- పదో తరగతితోపాటు ఐటీఐ(ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు(ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: 01.01.2023 నాటికి 18-35 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు లభిస్తుంది.
వేతనాలు
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల రూ.24,340 -రూ.39,405 వరకు మూలవేతనంగా లభిస్తుంది.
ఎంపిక ఇలా
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన వారిని రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు అనుగుణంగా తుది ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
రాత పరీక్ష
ఈ పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు ఉంటుంది. ఇందులో 65 ప్రశ్నలు సంబంధిత ఐటీఐ విభాగం నుంచి అడుగుతారు. మిగతా 15 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ విభాగానికి సంబంధించి ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది.
సిలబస్ అంశాలు
- ఐటీఐ(ఎలక్ట్రికల్ ట్రేడ్): ఈ విభాగానికి సంబంధించి 65 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మెషిన్స్, ట్రాన్స్‌ఫర్మార్లు, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్, ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అంశాలు ఉంటాయి.
- జనరల్ నాలెడ్జ్: అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్‌జ్యూమర్ రిలేషన్స్, దైనందిన జీవితంలో జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూవ్‌మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ.
- పోల్ క్లైంబింగ్: రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే రిజర్వేషన్‌ను అనుసరించి 1:2 నిష్పత్తిలో పోల్ క్లైబింగ్ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. పోల్ క్లైంబింగ్‌లో అర్హత సాధించిన వారిని తుదిగా ఎంపికచేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
- కళాకారులకు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20 మార్కుల వరకు వెయిటేజీ లభిస్తుంది.
- క్వాలిఫయింగ్ మార్కులు: ఓసీ/ఈడబ్ల్యూఎస్-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 30 శాతం క్వాలిఫయింగ్ మార్కులు సాధించాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 28, 2023
- హాల్‌టికెట్స్: ఏప్రిల్ 24, 2023 నుంచి
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 30, 2023
- వెబ్‌సైట్: https://tssouthernpower.cgg.gov.in
చదవండి: TSSPDCL Recruitment 2023: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1553 జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |