Skip to main content

DRDO Recruitment 2022: పది, ఇంటర్‌ అర్హత‌తో 1061 పోస్టులు... రాత పరీక్ష ఇలా..

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ.. సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌(సెప్టెమ్‌-10/ఎఅండ్‌ఎ) అడ్మిన్‌ అండ్‌ అలైడ్‌ కేడర్‌ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధన కేంద్రాల్లో.. 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
DRDO Recruitment 2022 For 1061 Jobs and Exam Pattern
  • నెలకు రూ.40వేలకు పైగా వేతనం
  • 1061 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

విభాగాల వారీగా పోస్టులు

జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ (జేటీవో)-33, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-215, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-123, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ఎ(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-250, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ఎ(హిందీ టైపింగ్‌)-12, స్టోర్‌ అసిస్టెంట్‌  ఎ(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-134, స్టోర్‌ అసిస్టెంట్‌ ఎ(హిందీ టైపింగ్‌)-04,  సెక్యూరిటీ అసిస్టెంట్‌ 'ఎ'-41, వెహికిల్‌ ఆపరేటర్‌ ఎ-145, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్‌ ఎ-18, ఫైర్‌మ్యాన్‌ విభాగంలో 86 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పోస్టులను అనుసరించి పదోతరగతి,ఇంటర్, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. జేటీవో, స్టేనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు 30 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక ఇలా: పోస్టులను అనుసరించి ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. ఇందులో టైర్‌-1 (సీబీటీ), టైర్‌-2(నైపుణ్య, శారీరక దారుఢ్య, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష
ఈ పరీక్ష టైర్‌-1, టైర్‌-2లుగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే పోస్టులను అనుసరించి పరీక్ష వేర్వేరుగా ఉంటుంది.
టైర్‌-1
జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌: ఈ పోస్టులకు సంబంధించి  80 ప్రశ్నలు-80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్‌ హిందీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులకు, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.

ఇతర పోస్టులకు
జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ మినహా ఇతర అన్ని పోస్టులకు సంబంధించి టైర్‌-1 పరీక్ష ఒకే విధంగా ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి 75 ప్రశ్నలు-75 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. టైర్‌-2: జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ మినహా మిగత అన్ని పోస్టులకు నైపుణ్య, శారీరక దారుఢ్య, సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్లకు టైర్‌-2 కింద డిస్క్రిప్టివ్‌ టెస్టును ఉంటుంది.
టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌: ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఎస్సే రూపంలో ప్రశ్నలను అడుగుతారు. డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్షను రాయాల్సి ఉంటుంది.
వేతనాలు: ఎంపికైన జేటీవో, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1 ఉద్యోగులకు ప్రతినెల రూ.35,400 -రూ. 1,12,400 వరకు వేతనంగా అందిస్తారు. అలాగే గ్రేడ్‌-2 వారికి రూ.25,500-రూ.81,100, ఇతర పోస్టులకు ఎంపికైన వారికి రూ.19,900-రూ. 63,200 వరకు వేతనంగా లభిస్తుంది.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
  • దరఖాస్తులకు చివరిత తేదీ: 07.12.2022
  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
  • వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

 

చ‌ద‌వండి: DRDO Recruitment 2022: డీఆర్‌డీవోలో 1061 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories